పవన్ వీరాభిమాని vs పవన్ భక్తుడు | Ramgopal Varma, Bandla Ganesh twitter War | Sakshi
Sakshi News home page

పవన్ వీరాభిమాని vs పవన్ భక్తుడు

Published Tue, Oct 13 2015 10:35 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ వీరాభిమాని vs పవన్ భక్తుడు - Sakshi

పవన్ వీరాభిమాని vs పవన్ భక్తుడు

ఇటీవల ట్విట్టర్ వేదికగా సంచలనాలు సృష్టిస్తున్న రామ్గోపాల్వర్మ. మరోసారి తనదైన ట్వీట్లతో చెలరేగిపోయాడు. అయితే ప్రతిసారీ వన్ సైడెడ్గా వర్మ మాత్రమే కామెంట్లు చేస్తూ ఉండేవాడు. ఈసారి వర్మతో మరో సెలబ్రిటీ వాదనకు దిగటంతో టాపిక్ మరింత ఆసక్తికరంగా మారింది.

గత కొతం కాలంగా పవన్ అభిమానులను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్న వర్మ, సోమవారం పవన్ అభిమానులు వరల్డ్ పవనిజం డేగా జరుపుకోవటం మీద సెటైర్లు వేశాడు. పవన్ సినిమాల్లోకి అడుగుపెట్టి 19 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అభిమానుల చేస్తున్న హడావిడిపై వర్మ ట్విట్టర్లో కామెంట్ చేశాడు.

ఈ సందర్భంగా ' ఓ పవన్ కళ్యాణ్ అభిమానిగా.. మిగతా అభిమానులందరికంటే పవన్ను నేనే ఎక్కువగా ఇష్టపడతాను. సర్దార్ గబ్బర్సింగ్ బాహుబలి కంటే పెద్ద విజయం సాధిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ అర్జెంటినా, ఐలాండ్, ఆఫ్రికా మొత్తం అమెరికాలో చాలా ఫేమస్. వరల్డ్ పవనిజం డే సందర్భంగా కంగ్రాట్స్'  అంటూ పవన్ అభిమానులకు చురకలంటించాడు వర్మ.

ఇక్కడి వరకు రొటీన్ అయినా, పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ ఎంట్రీ తో ట్విట్టర్ లో మంచి ట్విస్ట్ వచ్చింది. ' మా పవన్ మీద వచ్చే విమర్శలు మాకు ఊరేగింపులో పడే మల్లెపూల లాంటివి. సూర్యుడి మీద ఉమ్మేస్తే ' అంటూ వర్మకు కౌంటర్ ఇచ్చాడు గణేష్. అంతటితో ఆగకుండా 'ఆర్జీవి, మీకు పవన్ ఫ్యాన్స్ మీద కోపం తగదు, మాలాంటి ఫ్యాన్స్కు ముందు నిలబడి మీరే మమ్మల్ని నడిపించాలి. ఇది నా రిక్వస్ట్, పవన్ కళ్యాణ్ మీద రాత్రి పూట ట్వీట్లు చేసి మా నిద్రని, పగలు ట్వీట్లు చేసి మా పనిని చెడగొట్టద్దు' అంటూ రిప్లై ఇచ్చాడు.

బండ్ల గణేష్ ట్వీట్ల పై స్పందించిన వర్మ ' పవనిజం పుస్తకంలో రాసిన ఆర్దర్ స్కోపెన్ హెయిర్ ఫిలాసఫీ ఆధారంగానే నేను కామెంట్స్ చేశాను. నిరక్షరాస్యుల కోసం నేను తగ్గి మాట్లాడలేను' అంటూ కౌంటర్ ఇచ్చాడు. గణేష్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 'మీరు బాగా చదువుకొని ఉండొచ్చు, కానీ మాకు సంస్కారవంతమైన జీవితం ఇచ్చిన పవన్ వివేకవంతుడు'. అంటూ ట్వీట్ చేశాడు. వెంటనే వర్మ 'నువ్వు అనవసరంగా పవన్ అభిమానులను తప్పుదారి పట్టిస్తున్నావు.. నేను చెప్పినదంతా పవనిజం పుస్తకంలోదే' అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరోసారి గణేష్ 'మాకు పుస్తకాలు అక్కర్లేదు.. పవన్ లుక్ మాపై పడితే చాలు' అని మాటల యుద్ధం ముగించాడు.

ఇప్పటివరకు తన మాటల తూటాలకు ఎదురులేదని భావిస్తున్న వర్మ బండ్ల గణేష్ కామెంట్లతో కాస్త షాక్ తిన్నా, ఫాలోవర్స్కు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement