మళ్లీ ప్రేమ యాత్ర! | Ranbir Kapoor, Katrina Kaif in Maldives for holiday | Sakshi
Sakshi News home page

మళ్లీ ప్రేమ యాత్ర!

Published Wed, Apr 22 2015 11:06 PM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

మళ్లీ ప్రేమ యాత్ర!

మళ్లీ ప్రేమ యాత్ర!

 రెండేళ్ల క్రితం రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ ఎవరికీ తెలియకుండా రహస్యంగా స్పెయిన్ వెళ్లారు. అక్కడి బీచ్‌లో ఇద్దరూ ఈత దుస్తుల్లో విహరించిన వైనాన్ని ఎవరో కెమెరాలో బంధించి, అంతర్జాలంలో పెట్టేశారు. దాంతో రహస్యం కాస్తా బట్టబయలయ్యింది. అలా జరిగినందుకు కత్రినా తెగ ఫీలైపోయారు. ఇప్పుడు మళ్లీ ఈ జంట విహార యాత్రకు వెళ్లారు.
 
 ఈసారి ఆ ప్రయాణాన్ని వాళ్లిద్దరూ రహస్యంగా ఉంచలేదు. ఇద్దరూ కలిసి ముంబయ్‌లో ఫ్లయిట్ ఎక్కడం నలుగురి కంట్లోనూ పడింది. ఆ తర్వాత మాల్దీవుల్లో దిగినప్పుడూ అందరి దృష్టిలో పడ్డారు. రెండేళ్ల క్రితం ఈత దుస్తుల్లో దొరికిపోయిన ఈ ఇద్దరూ ఇప్పుడే విధంగా చిక్కుతారో? అని హిందీ రంగంలో జోకులేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. రణబీర్ కపూర్ కుటుంబంతో ఇటీవల ఓ ఐదు నక్షత్రాల హోటల్లో విందారగించారు కత్రినా.
 
 ఇప్పుడు పెద్దల అనుమతితోనే ఈ ఇద్దరూ విహార యాత్రకు వెళ్లారట. కపూర్ కుటుంబం కత్రినాను తమ ఇంటి కోడలిగా చేసుకోవడానికి సిద్ధంగా లేదనే వార్త వినిపించింది. కానీ, ఈ విందులూ, విహార యాత్రలూ చూస్తుంటే.. పెళ్లికి పచ్చజెండా ఊపారని ఊహించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement