సాక్షి, ముంబై : పెళ్లయి తర్వాత గ్యాప్ తీసుకుంటున్న హీరోయిన్లు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా పాత్రా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కానీ, నాలుగేళ్ల తర్వాత తిరిగి ‘హిచ్‌కీ’తో రీఎంట్రీ ఇచ్చిన రాణీ ముఖర్జీ మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది.
మొదటి రోజు ఆ చిత్రం రూ. 3కోట్ల 30లక్షలు వసూలు చేసి.. ఈ మధ్య రిలీజ్ వచ్చిన లేడీ ఓరియంటల్ చిత్రాల్లో తొలి రోజు వసూళ్లలో టాప్ స్థానంలో నిలిచింది. అయితే పెళ్లయితే వాళ్ల సినిమాలు హిట్ కాకూడదా? అని రాణీ ముఖర్జీ ఇప్పుడు ప్రశ్నిస్తోంది. ‘ఓ సినిమా విజయవంతం కావటానికి కావాల్సింది మంచి కథ, నటీనటుల ఫెర్ ఫార్మెన్స్. అంతేగానీ అందులో నటించేవారికి పెళ్లయ్యిందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. వ్యక్తిగత జీవితాన్ని.. సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతానా? అన్న అనుమానాల మధ్యే నటించటం మొదలుపెట్టాను. కానీ, నటనే నా జీవితం అన్న విషయం నాకు ఈ చిత్రం మళ్లీ గుర్తు చేసింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో నా కూతురు అదిరాను చూసుకుంటూనే.. ఇకపై నటనలోనూ కొనసాగుతా. ఆదరిస్తున్న వారికి నా కృతజ్ఞతలు’ అని ఆమె తెలిపారు.
టూరెట్ సిండ్రోమ్‌తో బాధపడే ఓ మహిళ, టీచర్‌గా మారి వీధి బాలల బతుకులను మార్చాలని యత్నించటం... ఆ క్రమంలో అందరితో ఆమె అవమానాలు ఎదుర్కోవటం...ఆ ప్రయత్నంలో చివరకు విజయం సాధించటం అనే కథాంశంతో హిచ్‌కిని దర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెరకెక్కించాడు.
Heroine-centric movies and Day 1 biz...
— taran adarsh (@taran_adarsh) 24 March 2018
Note: Diverse genres... Varying screen count... India biz...#Hichki
Day 1: ₹ 3.30 cr#TumhariSulu
Day 1: ₹ 2.87 cr#Mom
Day 1: ₹ 2.90 cr#Simran
Day 1: ₹ 2.77 cr#BegumJaan
Day 1: ₹ 3.94 cr
Comments
Please login to add a commentAdd a comment