బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొనేపై మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఈ జంట బయట కనిపిస్తే చాలు.. కెమెరా కళ్లన్నీ అటువైపే తిరుగుతాయి. ఇక రణ్‌వీర్.. దీపికాకు సపర్యలు చేస్తూ ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.
ఇక ఈ ‘గల్లీబాయ్’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటుతున్నాడు. అయితే తాజాగా రణ్‌వీర్ సింగ్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. తన భార్య దీపికా.. రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి నటిస్తే.. ఇన్‌సెక్యుర్‌గా భావిస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. రణ్‌వీర్ కూల్‌గా బదులిచ్చాడు. ‘నేను అలా కనబడుతున్నానా? నన్ను చూస్తే నిజంగా అలా అనిపిస్తుందా? నేను అసలు అలాంటి వ్యక్తిని కాదు. అయినా ఆమెను నాకన్నా ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించలేరు, సో నాకేం బాధలేదు’ అని ఈ ‘సింబా’ క్లారిటీగా చెప్పేశాడు. ఆ మధ్య రణ్‌బీర్ కపూర్-దీపికా ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వార్తలు వచ్చాయి.. అటుపై బ్రేకప్ కూడా జరిగిందన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మీడియా ఈ ప్రశ్నను అడిగింది. దీనిపై రణ్‌వీర్ తన శైలిలో స్పందించాడు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ ‘సింబా’, ‘గల్లీబాయ్’ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లతో దూసుకుపోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment