
ఖరీదైన లంబోర్గిని కారు (ఫైల్ ఫోటో)
సాక్షి,ముంబై: బాలీవుడ్ హీరో,బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె భర్త రణ్‌వీర్ సింగ్ అద్భుతమైన, ఖరీదైన కొత్త ఎర్ర కారుతో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడు. మోస్ట్ ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రణ్వీర్ సింగ్ తనదైన శైలిలో తాజాగా ముంబై వీధుల్లో హంగామా సృష్టించాడు. ఖరీదైన బైక్స్, కార్లు అంటే మోజు, అందులోనూ ఎరుపు రంగుమీద మక్కువ ఎక్కువున్న ఈ హీరో ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. దీని ధర మూడు కోట్లకు పై మాటే. ఇంకా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ రాని కారులో రణవీర్ షికారు చేస్తూ మీడియా కంట పడ్డాడు.
ఇటీవల 'గల్లీ బాయ్' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం '83' అనే సినిమాలో నటిస్తున్నాడు. భార్య దీపికా పదుకొనేతో కలిసి నటిస్తున్నీ సినిమా 2020 ఏప్రిల్ 10 న విడుదల కానుందని భావిస్తున్నారు. అలాగే భారత స్టార్ క్రికెటర్ , మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తుండగా, దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది.
కాగా దేశీయంగా ఆటో సెక్టార్ అమ్మకాలు లేక కుదేలవుతోంటే, దేశీయ మార్కెట్లో లంబోర్గిని కార్లకు ఫుల్ డిమాండ్ ఉండడంతో భారీగా విక్రయాలు నమోదువుతున్నాయి. 3 కోట్ల విలువ చేసే ఈకారు, వారాని కొకటి చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయనీ, వచ్చే మూడేళ్లలో ఏడాదికి 100 వాహనాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లంబోర్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ ఇటీవల వెల్లడించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment