
హెడ్డింగ్ చదివి రణ్‌వీర్ సింగ్, రానా కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యిందనుకుంటున్నారా! అదేం కాదు. విషయం ఏంటంటే... రీసెంట్‌గా రిలీజైన హాలీవుడ్ చిత్రం ‘ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ సినిమా తెలుగు వెర్షన్‌కు విలన్ థానోస్‌కు రానా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ నెలలో విడుదల కానున్న హాలీవుడ్ చిత్రం ‘డెడ్‌పూల్ 2’ చిత్రంలోని హీరో ర్యాన్ రేనాల్డ్స్ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు రణ్‌వీర్ సింగ్.
అసలు విషయం అది. ‘‘కెనడియన్ యాక్టర్ రేనాల్డ్స్‌కు హిందీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు రణ్‌వీర్ సింగ్. ‘‘నేను డబ్బింగ్ చెప్పడానికి ఒకవేళ హిందీ కోర్స్‌లో జాయిన్ అయ్యుంటే అదో ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ అయి ఉండేది’’ అని సరదాగా అన్నారు రేనాల్డ్స్.
Comments
Please login to add a commentAdd a comment