రంగుపడుద్ది..? | Ravi Teja New Movie With Kona Venkat | Sakshi
Sakshi News home page

రంగుపడుద్ది..?

Published Mon, Sep 22 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

రంగుపడుద్ది..?

రంగుపడుద్ది..?

 ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఘటోత్కచుడు’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటే, అందులో ‘రంగు పడుద్ది’ అంటూ ఏవీయస్ చెప్పిన డైలాగ్ గుర్తుకు రాక మానదు. అప్పట్లో పాపులర్ అయిన ఈ డైలాగ్ ఇప్పటికీ వాడుకలో ఉంది. ఈ పాపులర్ డైలాగ్‌నే టైటిల్‌గా పెట్టి కోన వెంకట్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. రచయితగా స్టార్‌డమ్ సంపాదించుకున్న కోన ఆ మధ్య ‘రామ్ అండ్ జూలియట్’ అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘రంగు పడుద్ది’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని బోగట్టా. ఇలాంటి టైటిల్స్ రవితేజ వంటి మాస్ హీరోలకు సరిగ్గా నప్పుతాయి. ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించనున్నారని వినికిడి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement