డేట్‌ ఫిక్స్‌ | Ravi Teja's next logo launch on November 13th | Sakshi
Sakshi News home page

డేట్‌ ఫిక్స్‌

Published Fri, Nov 9 2018 2:39 AM | Last Updated on Fri, Nov 9 2018 2:39 AM

Ravi Teja's next logo launch on November 13th - Sakshi

నెక్ట్స్‌ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించేందుకు డేట్‌ ఫిక్స్‌ చేశారు రవితేజ. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ ఫేమ్‌ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తారు.

ఇందులో ముగ్గరు కథానాయికలు ఉంటారని సమాచారం. ఆల్రెడీ నభా నటేష్, పాయల్‌ రాజ్‌పుత్‌లను ఎంపిక చేశారు టీమ్‌. ఈ సినిమా టైటిల్‌ లోగో పోస్టర్‌ను ఈ నెల 13న రిలీజ్‌ చేయనున్నట్లు దీపావళి సందర్భంగా వీఐ ఆనంద్‌ తెలిపారు. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement