పదేళ్ల తర్వాత... | Ravi Teja's Yevado Okadu Movie Launch | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత...

Published Fri, Oct 23 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM

పదేళ్ల తర్వాత...

పదేళ్ల తర్వాత...

రవితేజ కెరీర్‌లో ‘భద్ర’ చిత్రానికి ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. రవితేజ హీరోగా ‘దిల్’ రాజు నిర్మించిన ఆ చిత్రం విడుదలై పదేళ్లయ్యింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రవితేజతో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఎవడో ఒకడు’ దసరా రోజున హైదరాబాద్‌లో ఆరంభమైంది. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణుశ్రీరామ్ దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘అనుపమా పరమేశ్వరన్ ఓ కథానాయిక.

మరో కథానాయిక ను ఎంపిక చేయాల్సి ఉంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. 2016 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, డైలాగ్స్: రమేశ్-గోపి, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, సహ-నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement