టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఎదుట హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం సుమారు నాలుగురోజుల పాటు ఆయన ఇళ్లు, ఆఫీసులలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన వ్యాపారాలకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ అధికారులు తణిఖీలు చేశారని దిల్ రాజు కూడా చెప్పారు. అయితే, అదే సమయంలో దిల్ రాజు వ్యాపారాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఐటీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన వ్యాపారాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
చిత్ర పరిశ్రమలో తన సినిమాలకు అయిన ఖర్చు ఎంత..? ఎగ్జిబిటింగ్ లెక్కలతో పాటు మూవీ విడుదల తర్వాత వచ్చే లాభాల వ్యవహారంపై ఐటీ అధికారలు ఆరా తీయనున్నారు. సంక్రాంతి సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలను దిల్ రాజు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలోనే ఆయనపై ఐటీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. దిల్ రాజ్‌తో పాటు పలువురు నిర్మాత, దర్శకుడు ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహించింది.
ఐటీ సోదాలు అంశంలో ఎవరూ ఎక్కువగా ఊహించుకొవద్దని దిల్ రాజు గతంలోనే అన్నారు. ఎలాంటి హాడావుడి లేకున్నా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో అంతా ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ కొనసాగుతుంది అన్నారు. దీంతో వ్యాపారా ట్రాన్సాక్షన్సె కూడా ఆన్‌లైన్ జరుగుతున్నాయి అన్నారు. అయితే, ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నారని ఆ సమయంలో తమ ఆడిటర్స్ వెళ్లి కలుస్తారని దిల్ రాజు తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం వారు వెళ్లినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment