![జీవితాలను మార్చేసే రిక్వెస్ట్! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61435342462_625x300.jpg.webp?itok=XVtXyF8q)
జీవితాలను మార్చేసే రిక్వెస్ట్!
ఫేస్‌బుక్‌లో చాలా మంది తెలిసిన వాళ్లకి, తెలియని వాళ్లకు అదే పనిగా రిక్వెస్ట్‌లు పంపుతూ ఉంటారు. మరి అదే రిక్వెస్ట్ కొంత మంది జీవితాలను ప్రమాదంలోకి నెడితే ఎలా ఉంటుందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. మోడరన్ సినిమా పతాకంపై ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ఫేం ఆదిత్య ఓం హీరోగా నటిస్తూ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మనీషా ఖేల్కర్, రిచా సోని, సాగరిక ముఖ్యతారలు. ఈ చిత్రం టీజర్‌ను రుద్రరాజు పద్మరాజు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘‘అనేక కష్టాలను తట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇప్పుడొస్తున్న హారర్ చిత్రాలకు చాలా భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’’ అని ఆదిత్య ఓం చెప్పారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేశ్ ప్రసాద్, కేవీవీ సత్యనారాయణ, విజయవర్మ తదితరులు పాల్గొన్నారు.