మున్నాభాయ్ కి సల్మాన్ 'వెల్ కమ్' పార్టీ ! | Salman Khan arranges bash at Panvel farmhouse for Sanjay Dutt | Sakshi
Sakshi News home page

మున్నాభాయ్ కి సల్మాన్ 'వెల్ కమ్' పార్టీ !

Published Thu, Feb 25 2016 6:06 PM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

మున్నాభాయ్ కి సల్మాన్ 'వెల్ కమ్' పార్టీ ! - Sakshi

మున్నాభాయ్ కి సల్మాన్ 'వెల్ కమ్' పార్టీ !

సంజయ్ దత్, సల్మాన్ ఖాన్లు బాలీవుడ్లో చిరకాల మిత్రులన్న విషయం చాలా మందికి తెలుసు. ఇరు కుటుంబాల మధ్య కూడా ఏళ్లుగా సత్సంబంధాలున్నాయి. క్లిష్ల పరిస్థితుల్లో సల్మాన్ సంజయ్కు వెన్నుదన్నుగా నిలిచారు. అక్రమాయుధాల కేసులో 42 నెలలుగా ఎరవాడ జైలులో శిక్ష అనుభవించిన సంజయ్ దత్ గురువారం విడుదలైన సందర్భంగా సల్లూ భాయ్ ఆయనకు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు.

సల్మాన్కు చెందిన పాన్వెల్ ఫామ్ హౌస్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య స్నేహితుడితో సంతోషాన్ని పంచుకోబోతున్నారు. సల్మాన్ ఈ రోజు సాయంత్రం సర్ ప్రైజ్ పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం సల్మాన్ 'సుల్తాన్' షూటింగ్ కోసం హరియాణా వెళ్తారు. సంజయ్ కూడా వెంటనే తన ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో పడతారని ఆయన చెల్లెలు ప్రియా దత్ వివరించారు. కాగా విడుదల అనంతరం సంజయ్ దత్ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement