బిగ్‌బాస్‌: ఒక్క వారానికి రూ.16 కోట్లు? | Salman Khan to Charge Rs 16 Cr per Episode for Bigg Boss 14 | Sakshi
Sakshi News home page

తాజా సీజన్‌ కోసం భారీ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తోన్న హీరో

Published Mon, Jul 6 2020 2:26 PM | Last Updated on Mon, Jul 6 2020 2:45 PM

Salman Khan to Charge Rs 16 Cr per Episode for Bigg Boss 14 - Sakshi

బిగ్‌బాస్‌ షోకు దేశ వ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సల్మాన్‌ ఖాన్‌ లేని హింది బిగ్‌బాస్‌ షోను అస్సలు ఊహించుకోలేము. 2010 నుంచి దాదాపు 10 సీజన్‌లుగా సల్మాన్‌ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. హిందీ బిగ్‌బాస్‌ షో ఇంత విజయవంతం కావడంలో సల్మాన్‌ కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా బిగ్‌బాస్‌ షో నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి బిగ్‌బాస్‌ షో ప్రసారం కానున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది బిగ్‌బాస్‌ షో కోసం సల్మాన్‌ భారీ రెమ్యూనరేషన్‌ను డిమాండ్‌ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ 14వ సీజన్‌కి గాను సల్మాన్‌ ఒక్క వారానికే రూ. 16 కోట్ల రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.(పెళ్లి కావాల్సిన అమ్మాయిని కదా.. అందుకే..)

సీజన్ 4 నుంచి 6 వరకు సల్మాన్ ఒక్కో ఎపిసోడ్‌కి సుమారు 2.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ని తీసుకున్నారు. అయితే సీజన్ 7కు వచ్చేసరికి దాన్ని రెట్టింపు చేసి ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 5కోట్లు తీసుకున్నట్లు సమాచారం. సీజన్‌లతో పాటు సల్మాన్‌ రెమ్యూనరేషన్‌ని కూడా భారీగానే పెంచుతూ పోయాడు. అలా సీజన్‌ 9 కోసం 7-8 కోట్ల రూపాయలు, సీజన్‌ 12లో ఎపిసోడ్‌కు రూ. 12 నుంచి 14 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సీజన్ 13 నాటికి మొత్తం సుమారు 26 ఎపిసోడ్లకు గాను అతను రూ. 403 కోట్లు అందుకునన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గత సీజన్‌ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్వహకులు ఈ ఏడాది బిగ్‌బాస్‌ షోను 5 వారాల పాటు పొడిగించినట్లు సమాచారం. దాంతో సల్మాన్‌ తన రెమ్యూనరేషన్‌ని కూడా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా బిగ్‌బాస్‌ సీజన్‌ 14 నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే తాజాగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాలు, సీరియల్స్‌ షూటింగ్‌లకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బిగ్‌బాస్‌ సీజన్‌ 14ను తెరమీదకు తీసుకువచ్చేందుకు నిర్వహకులు సన్నాహాలు చేస్తోన్నారు. సల్మాన్ ఖాన్‌ పన్వెల్ ఫామ్‌హౌస్‌లోనే ఈ బిగ్‌బాస్‌ సీజన్‌ 14 షూటింగ్‌ని నిర్వహించనున్నట్లు సమాచారం. బిగ్‌బాస్‌ 14 కోసం ఇప్పటికే ‘హమారి బహు సిల్క్‌’కు చెందిన జాన్ ఖాన్, ‘భబీజీ ఘర్ పర్ హై’కు చెందిన శుభంగి అత్రే, ‘తుజ్‌ సే హై రాబ్తా’ నటుడు షాగున్ పాండేలను సంప్రదించినట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రటకన వెలువడలేదు. (బిగ్‌బాస్‌ 4 సీజన్‌లో సమంత?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement