కరోనా: ఇది మన సంస్కృతికి గొప్పతనం | Salman Khan Shares Sketching Video Over Crisis Corona Virus Amid | Sakshi
Sakshi News home page

కరోనా: స్కెచ్‌ వేసిన భాయిజాన్‌

Published Thu, Mar 19 2020 11:11 AM | Last Updated on Thu, Mar 19 2020 1:23 PM

Salman Khan Shares Sketching Video Over Crisis Corona Virus Amid - Sakshi

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియోటర్లను మూసి వేయడంతో పాటు సినిమా షూటింగ్‌లు కూడా వాయిదా పడ్డాయి. దీంతో హీరో హీరోయిన్స్‌ అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ విరామ సమయంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా ఇంట్లోనే వర్కవుట్స్‌, వ్యాయమం​ చేస్తున్న వీడియోలతో పాటు కుటుంబంతో సరదాగా గడుపుతున్న వీడియోలను సోషల్‌ మీడియాలో తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందుకు బాలీవుడ్‌  భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ మినహాయింపు కాదు. ఈ ఖాళీ సమయంలో తనలోని టాలెంట్‌కు పని చెప్పాడు భాయిజాన్‌. పేపర్‌పై మహిళ, పురుషుడి  స్కెచ్‌ వేస్తున్న వీడియోను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.  (నేను సేఫ్‌గా చేరుకున్నా: హీరోయిన్‌)

కరోనా: నిబంధనలు ఉల్లంఘించిన హీరో!

సల్మాన్ నల్లని దుస్తుల్లో ఉన్న  మహిళా, పురుషుడి చిత్రాని స్కెచ్‌ వేస్తూ.. ‘ప్రస్తుతం మనం ధరించే విధానం.. భారత సంస్కృతికి గొప్పతనం’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక భాయిజాన్‌ స్కేచ్‌కు ‘సూపర్‌ టాలెంట్‌’  ‘చాలా అద్భుతంగా’ ఉందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా కరోనా వ్యాపిస్తున్న కారణంగా ప్రజలు తమని తాము మాస్క్‌లతో, గొడుగులతో కప్పి పుచ్చుకుంటున్న విధానాన్ని ఉద్దేశిస్తూ.. సరదాగా ఈ స్కెచ్‌ వేసినట్లు ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ నటిస్తున్న ‘రాధే’ చిత్రం ఈ ఏడాది రంజాన్‌కు విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే.  కరోనా వైరస్‌ కారణంగా ‘రాధే’ షూటింగ్‌ వాయిదా పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement