ఇంట్లో ఉండటానికేం ఇబ్బంది? | Salman Khan appeals fans to follow lockdown rules for their own safety | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఉండటానికేం ఇబ్బంది?

Published Fri, Apr 17 2020 1:42 AM | Last Updated on Fri, Apr 17 2020 1:42 AM

Salman Khan appeals fans to follow lockdown rules for their own safety - Sakshi

సల్మాన్‌ ఖాన్‌

‘ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించకుండా అనవసరంగా ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్లను చూస్తే చాలా కోపం వస్తోంది’’ అన్నారు సల్మాన్‌ ఖాన్‌. ఈ విషయంపై తన ఆగ్రహాన్ని ఓ వీడియో రూపంలో తెలియజేశారు. ‘‘ప్రస్తుతం అందరి లైఫ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నట్టుంది. కానీ కొంతమంది మాత్రం నియమాలను అతిక్రమిస్తున్నారు. అనవసరంగా ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చినా మాస్కులు ధరించడం లేదు.

ఇంట్లో ఉండటానికేం ఇబ్బంది?  దేశ జనాభా తగ్గించాలని అంత ఆరాటంగా ఉందా?  కరోనా పాజిటివ్‌ అని తేలినవారిని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. దేవుడు మనలోనే ఉన్నాడు అని చిన్నప్పుడు చదువుకున్నాం. ఇంట్లోనే ఉండి మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి. బయట మనకోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టి పని చేస్తున్నవాళ్లకు అసౌకర్యం కలిగించకండి. వాళ్లను గౌరవించండి’’ అని ఆ వీడియోలో తన మనోభావాలను సల్మాన్‌ వ్యక్తపరిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement