lockdown of Islamabad
-
వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు
సాక్షి, హైదరాబాద్: పర్యాటకం, విద్య, ఉద్యోగం ఇతర కారణాల వల్ల తమ సొంత ప్రాంతానికి వెళ్లలేని వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ–పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తమ సొంత ఊరు, రాష్ట్రం వెళ్లాలనుకునేవారు https://tsp.koopid.ai/epass లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఈ–పాస్ పొందవచ్చని తెలిపారు. ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్ మాత్రమే జారీ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ–పాస్ అవసరమైన వారు సంబంధిత పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, ప్రాంతం, ఇతర వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో పొందుపర్చిన వివరాల ఆధారంగా అన్ని అంశాల్ని పరిశీలించిన తర్వాత ఆన్లైన్లోనే ఈ పాసులు జారీ చేస్తామని, వాటి సహాయంతో సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. (పోలీసులపై దాష్టీకాలా?) Dear Citizens Who Got Stranded in Telangana due to #LockDown & want to leave for their Homes in other States in India can Apply for E-PASS by submitting required information @ the given link.https://t.co/WCLZ5nScIl After due verification ur E-PASS will b sent to u,to move ahead. pic.twitter.com/yasu3Ck3YG — DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 2, 2020 కోవిడ్ ’ఫ్రీ’ చేసి పంపండి రెవెన్యూ, పోలీస్, మెడికల్ అధికారులతో కూడిన బృందాలు స్క్రీనింగ్ చేయాలి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ ఉత్తర్వులు లాక్డౌన్ కారణంగా ఉండిపోయి ఇప్పుడు తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారిని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి అంతర్రాష్ట్ర సరిహద్దుకు 2, 3 కిలోమీటర్ల ముందే పరీక్షలు నిర్వహించాలి. రెవెన్యూ, పోలీస్, మెడికల్ అధికారులతో కూడిన బృందం వారందరికీ పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో పరీక్షించాలి. లేవని నిర్ధారిస్తూ ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లో సర్టిఫై చేయాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వాహనాలకు కూడా నిర్దేశిత నమూనాలో పర్మిట్లు జారీ చేయాలి. వాహనం నంబర్‌తో పాటు ఎంతమంది ప్రయాణిస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారనే అంశాలను పర్మిట్‌లో పేర్కొనాలి. స్క్రీనింగ్ చేసే బృందాలు అవసరం మేరకు 24 గంటలు పనిచేసే విధంగా సిద్ధం చేసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని వెల్లడించారు. -
ఇంట్లో ఉండటానికేం ఇబ్బంది?
‘ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించకుండా అనవసరంగా ఇంటి నుంచి బయటకు వచ్చేవాళ్లను చూస్తే చాలా కోపం వస్తోంది’’ అన్నారు సల్మాన్ ఖాన్. ఈ విషయంపై తన ఆగ్రహాన్ని ఓ వీడియో రూపంలో తెలియజేశారు. ‘‘ప్రస్తుతం అందరి లైఫ్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నట్టుంది. కానీ కొంతమంది మాత్రం నియమాలను అతిక్రమిస్తున్నారు. అనవసరంగా ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చినా మాస్కులు ధరించడం లేదు. ఇంట్లో ఉండటానికేం ఇబ్బంది? దేశ జనాభా తగ్గించాలని అంత ఆరాటంగా ఉందా? కరోనా పాజిటివ్ అని తేలినవారిని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. దేవుడు మనలోనే ఉన్నాడు అని చిన్నప్పుడు చదువుకున్నాం. ఇంట్లోనే ఉండి మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి. బయట మనకోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టి పని చేస్తున్నవాళ్లకు అసౌకర్యం కలిగించకండి. వాళ్లను గౌరవించండి’’ అని ఆ వీడియోలో తన మనోభావాలను సల్మాన్ వ్యక్తపరిచారు. -
ఇవాళ ఒక్కరోజే 40మంది మృత్యవాత..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ లేకుంటే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. భారత్‌లో మొత్తం 7,447 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. గత 24 గంటల్లో 1,035 కొత్త కేసులు నమోదు కాగా, ఇవాళ ఒక్కరోజే 40మంది మృత్యువాత పడ్డారు. ఇక కరోనాతో కోలుకుని ఇప్పటివరకూ 642మంది డిశ్చార్జ్ అయినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 586 కరోనా ఆస్పత్రులు, లక్షకు పైగా ఐసోలేషన్ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌తో పాటు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యేవని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా మహారాష్ట్రలో కరోనా బారిన పడి అత్యధికంగా 110మంది మృతి చెందారు. (ప్రధానితో కాన్ఫరెన్స్: అందరి నోట అదే మాట!) మరోవైపు ముఖ్యమంత్రులుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధానిని కోరాయి. దీంతో రాష్ట్రాల విజ్ఞాపనలతో కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని యోచిస్తోంది. కాగా ఈ నెల 14తో లాక్డౌన్ ముగియనుంది. రాష్ట్రాల అభ్యర్థలతో ఈ నెల 30 వరకూ లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పంజాబ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకూ పొడిగించింది. (కరోనా మృతదేహాలు: మహారాష్ట్ర కీలక నిర్ణయం!) -
ఏపీలో కూరగాయల రవాణాకు అనుమతి
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న పూలు, పండ్లు, కూరగాయలు, మిర్చి, పసుపు రైతులకు ఊరట లభించింది. ఈ పంటల రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి ఆటంకం కలుగకుండా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు ఇచ్చే ఉత్తర్వులు కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. (లాక్డౌన్: వైరస్ కంటే మరింత ప్రమాదకరం!) లాక్డౌన్ నుంచి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ రవాణాలో చాలా చోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌధురి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఉద్యాన పంటల రవాణా, ఎగుమతి, శుద్ధి, సేకరణ, రైతు బజార్లకు, స్థానిక మార్కెట్లకు తరలింపు వంటి వాటికి గతంలో మినహాయింపు ఇచ్చినా సక్రమంగా అమలు కావడంలేదని, మరోసారి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు ఇస్తూ ఈ మినహాయింపులు అమలయ్యేలా చూడాలని కోరారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆమోదం తెలిపాయి. దీంతో జిల్లాలలో వ్యవసాయ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ చిరంజీవి చౌధురి జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. (కరోనాతో యుద్ధం : ప్రభుత్వానికి సహకరించండి) లేఖలో అంశాలు.. ► రాష్ట్రంలో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి పండ్లు, కూరగాయలు సేకరించి రవాణా చేసుకునేందుకు ఐఎన్ఐ ఫారమ్స్, దేశాయ్ ఫ్రూట్స్, ఐటీసీ ఇండియా లిమిటెడ్, మహీంద్రా, జైన్ ఇరిగేషన్ ఇండియా లిమిటెడ్, నింజా కార్ట్ తదితర సంస్థలకు అనుమతి ► రాష్ట్ర వ్యాప్తంగా మామిడి కాయల సేకరణ, ఎగుమతులకు అనుమతి ఇచ్చి పచ్చి సరుకు చెడిపోకుండా చూడాలి ► చిత్తూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఇతర జిల్లాలలో పండ్లు, కూరగాయల శుద్ధి పరిశ్రమలకు అనుమతి ► గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో పాటు పాడేరు ప్రాంతంలో మిర్చి, పసుపు సేకరణ, రవాణాకు అనుమతి ► కర్నూలు, ప్రకాశం జిల్లాలలో విత్తన శుద్ధి పరిశ్రమలకు అనుమతి ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే రవాణాకు అనుమతించాలి. ► ఖరీఫ్ సీజన్‌కు టిష్యూ కల్చర్ ప్లాంటింగ్ మెటీరియల్‌కు, సూక్ష్మనీటి పారుదల సామగ్రి రవాణాకు అనుమతించాలి. మొబైల్ రైతు బజార్లుగా సిటీ బస్సులు లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల చెంతకే కూరగాయలను తీసుకెళ్లేందుకు నగరాల్లో సిటీ బస్సుల్ని మొబైల్ రైతు బజార్లుగా తిప్పాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 200 బస్సులు కావాలని మార్కెటింగ్, ఉద్యాన శాఖ, మున్సిపల్ శాఖలు ఆర్టీసీకి ప్రతిపాదనలు పంపించాయి. ప్రయోగాత్మకంగా విజయవాడలో ఐదు సిటీ బస్సులను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినియోగించుకుని ఒక్క రోజులో పది క్వింటాళ్ల కూరగాయలు అమ్మారు. ఈ విధానం విజయవంతం కావడంతో విశాఖ, తిరుపతి, గుంటూరు తదితర నగరాల్లో కూడా ఇదే విధంగా సిటీ బస్సునే ప్రాంతాల వారీ తిప్పుతూ కూరగాయలను అమ్మితే ప్రజల్ని రోడ్లపైకి తిరగనివ్వకుండా కట్టడి చేయవచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది. జిల్లాల వారీగా ఎన్ని బస్సులు కేటాయించాలనే అంశంపై ఈ నెల 6న ఆర్టీసీ అధికారులు, మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం కానున్నారని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు. రైతులకు అనుమతి పత్రాలు.. పూలు, పండ్లు, కూరగాయల సాగు రైతులు ఎవరైనా స్థానిక మార్కెట్లలో తమ ఉత్పత్తులు అమ్ముకోవాలనుకుంటే తమ శాఖ అధికారులు అనుమతి పత్రాలు, పాస్‌లు అందజేస్తారని ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏ పంట అమ్ముకోవాలనుకుంటున్నారో తెలిపితే తమ అధికారులే తోటల వద్దకు వెళ్లి పాస్‌లు ఇస్తారని, దీనివల్ల రవాణాకు ఎటువంటి ఆటంకం ఉండదని వివరించారు. జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 1.50 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. శుక్రవారం (నిన్న) నుంచి జూన్ 16 వరకు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ► రైతుల నుంచి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, మార్కెటింగ్ సొసైటీలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ఈ పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1,760, హైబ్రిడ్ జొన్నకు రూ.2,550ని మద్దతు ధరగా నిర్ణయించినట్టు తెలిపారు. -
పాకిస్థాన్‌లో రాజకీయ అలజడి
ఇస్లామాబాద్: ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నవంబర్ 2న తలపెట్టిన 'ఇస్లామాబాద్ ముట్టడి' పాకిస్థాన్ లో తీవ్ర రాజకీయ అలజడిని సృష్టిస్తోంది. ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా చేస్తోన్న ఆందోళనలను మరింత ఉధృతం చేసే దిశగా పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన 'రాజధాని ముట్టడి' పిలుపునకు భారీ స్పందన లభిస్తోంది. వేలాది మంది పీటీఐ కార్యకర్తలతోపాటు సాధరణ జనం ఇప్పటికే ఇస్లామాబాద్ బాటపట్టినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. పలు పట్టణాల్లో పీటీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామాబాద్ నగర తూర్పు ప్రాంతం బనీగాలలోని ఇమ్రాన్ ఖాన్ నివాసాన్ని కూడా శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అక్కడున్న వందలాది మంది కార్యకర్తలపై లాఠీచార్జి చేసి ఖాన్ ను హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి తర్వాత కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సూచన మేరకు ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ కార్యకర్తలు, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 2న ప్రజాస్వామ్యం అంటే ఏమిటో నవాజ్ షరీఫ్ కు రుచిచూపిస్తామని, ఆయన నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పంజాబ్, ఖైబర్ ఫక్తున్ఖాల నుంచి ఇస్లామాబాద్ కు వెళ్లే రహదారులను పోలీసులు దిగ్బంధించారని, ప్రధాన రహదారులపై కాకుండా ఇతర మార్గాల్లో ఇస్లామాబాద్ కు పయనం కావాలని కార్యకర్తలకు సూచించారు. ఇమ్రాన్ ఖాన్ గృహనిర్బంధాన్ని గర్హిస్తూ పాకిస్థాన్ అంతటా నిరసనలు మిన్నంటాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అతని కుటుంబం భారీ అక్రమాలకు పాల్పడినట్లు పనామా పేపర్స్ బయటపెట్టిన నాటి నుంచి పీటీఐ ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే.