సమంత కోసం ‘మైత్రీ’ భారీ ప్లానింగ్‌! | Samantha Akkineni To Work In Mythri Movie Makers | Sakshi
Sakshi News home page

మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో సమంత?

Published Sun, May 17 2020 1:30 PM | Last Updated on Sun, May 17 2020 1:51 PM

Samantha Akkineni To Work In Mythri Movie Makers - Sakshi

అక్కినేని ఇంటి కోడలుగా మారిన తర్వాత కేవలం కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటిస్తున్నారు సమంత. గ్లామరస్‌ పాత్రల కంటే నటనకు ఆస్కారం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఈ క్రమంలో దక్షిణాదిలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా కూడా నిలుస్తున్నారు. యు ట‌ర్న్‌, సూప‌ర్ డీల‌క్స్‌, ఓ బేబీ వంటి చిత్రాలు సూప‌ర్‌హిట్ కావ‌డంతో ఈ త‌ర‌హా కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు సినిమాల‌తోనే కాకుండా డిజిట‌ల్ రంగంలోనూ ఆమె అడుగు పెట్టారు. `ద ఫ్యామిలీ మెన్` వెబ్ సిరీస్ సీజ‌న్‌2లో ఓ నెగటీవ్ పాత్రలో న‌టిస్తున్నాన‌ని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలోనూ చెప్పారామె.

ఈ క్రమంలో మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ వంటి స్టార్‌ హీరోలతో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సమంతతో ఓ భారీ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా పూర్తిగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రమని తెలుస్తోంది. సమంతతో ఓ సినిమా చేయాలని మైత్రీ ఎప్పట్నుంచో ప్లాన్‌ చేస్తోంది. అంతేకాకుండా ఆమెతో ఓ సినిమా కమిట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. దీంతో సమంతతో చిత్రాన్ని చేసేందుకు మంచి కథ, డైరెక్టర్‌ కోసం ఈ నిర్మాణ సంస్థ అన్వేషిస్తోంది. ప్రస్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు మైత్రీ మూవీస్ ఆఫీసులోనే జ‌రుగుతున్నాయి. దాంతో పాటు స‌మాంత‌రంగా స‌మంత క‌థ‌పై కూడా వ‌ర్క్ చేస్తున్నారు. మ‌రి స‌మంత‌కి త‌గిన క‌థ ఎప్పుడు సిద్దమవుతుందో వేచి చూడాలి. 

చదవండి:
ప్రియా షాకింగ్‌ నిర్ణయం.. ఫ్యాన్స్‌ షాక్‌
‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్‌ అవుతుందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement