
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. మరో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగా లాక్‌డౌన్‌తో అన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఈ చిత్రం నిర్మాణదశలో ఉండగానే తన తర్వాతి సినిమాను కన్ఫార్మ్ చేశారు శేఖర్ కమ్ముల. అది కూడా ‘లవ్ స్టోరీ’ చిత్ర నిర్మాతతోనే. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటించనున్నారని సమాచారం.
సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈ సారి లాక్‌డౌన్ విరామంలో తన తర్వాతి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను పూర్తి చేసుకున్నారు. లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది.
చదవండి:
నాగబాబు మరో సంచలన ట్వీట్: వైరల్
అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం
Comments
Please login to add a commentAdd a comment