
మహిళలే ఎక్కువ
‘‘స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉండాలని పోరాడడమే ఫెమినిజమ్ అయితే నేను ఫెమినిస్ట్ కాదు. మగవారి కంటే మహిళలే ఎక్కువ అని నమ్ముతా’’ అన్నారు షారుక్ ఖాన్. కొత్త ఏడాది ప్రారంభ వేడుకలప్పుడు బెంగళూరులో అమ్మాయిల పై జరిగిన ఈవ్ టీజింగ్ ఘటనపై షారుక్ తాజా ఇంటర్వూ్యలో స్పందించారు. మహిళలకు మద్దతు పలుకుతూ తన ఇద్దరు కుమారుల పెంపకం గురించి మాట్లాడారు. ‘‘మా అబ్బాయిలు ఆర్యన్, అబ్‌రమ్‌లకు మహిళలను హర్ట్ చేయొద్దని చెబుతుంటా. వాళ్లను గౌరవించమని అంటుంటా. ఒకవేళ మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే మీ తల నరికేస్తానని గట్టిగా చెప్పా’’ అని షారుక్ పేర్కొన్నారు.