ప్రే‘మాయ’లో... | Sharwanand to romance Nitya in Yemito Ee Maya | Sakshi
Sakshi News home page

ప్రే‘మాయ’లో...

Published Sun, Sep 29 2013 1:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

ప్రే‘మాయ’లో...

ప్రే‘మాయ’లో...

ప్రపంచంలో దేన్నయినా ఆక్యుపై చేసే కెపాసిటీ ప్రేమకే ఉంది. ఆ మాటకొస్తే అది లేని ప్లేస్ ఏముంది? ఆవహించడమే ఆలస్యం... తనను తానే మరిచిపోయేలా చేసే మాయావి ప్రేమ. ఆ మాయలో పడ్డాక తేరుకోవడం బహుకష్టం. శర్వానంద్, నిత్యామీనన్ ప్రస్తుతం అలాంటి మాయలోనే తేలియాడుతున్నారు. ఇదెప్పట్నుంచీ అనుకుంటున్నారా? విషయం ఏంటంటే... వీరిద్దరు ప్రస్తుతం ‘ఏమిటో ఈ మాయ’ అనే సినిమాలో నటిస్తున్నారు. వీరి ప్రేమ ఈ సినిమా కోసమే. చేరన్ దర్శకుడు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
‘స్రవంతి’ రవికిషోర్ మాట్లాడుతూ -‘‘తమిళంలో చేరన్ కున్న ఇమేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ప్రేమకథల్ని చాలా విభిన్నంగా, సహజంగా చిత్రీకరిస్తారు. ఈ సినిమా కూడా ఆ కోవకే చెందుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. అక్టోబర్ మూడోవారంలో పాటల్ని, నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణచైతన్య. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement