పూరీ... చోలే కర్రీ... శ్రద్ధగా తిన్నానోయి!
సాహో’ సెట్స్‌లోనైనా... సైనా నెహ్వాల్ ఇంట్లోనైనా... కుమ్ముడే కుమ్ముడు! శ్రద్ధా కపూర్ ఏమాత్రం తగ్గడం లేదు. ముద్దు ముద్దుగా వడ్డిస్తుంటే వద్దనకుండా ఫుల్లుగా లాగించేస్తున్నారు. ‘సాహో’ సెట్స్‌లో ప్రభాస్ అండ్ కో ఆతిథ్యాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ, శ్రద్ధగా తింటున్నానోయి అని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్స్ ఇస్తున్న ఈ ముంబయ్ బ్యూటీ, హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇంటికి వెళ్లినప్పుడూ సేమ్ ట్రెండ్ ఫాలో అయ్యారు. సైనా బయోపిక్‌లో శ్రద్ధా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ముంబయ్ వెళ్లే ముందు సైనా నెహ్వాల్ ఇంటికి వెళ్లారీ హీరోయిన్. ‘‘ఆంటీ (సైనా అమ్మ) చాలా ముద్దు చేశారు. పూరీ, చోలే కర్రీ, హల్వా, ఫ్రూట్ జ్యూస్... బాగా తిన్నానోయి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధా పేర్కొన్నారు.