Saina Biopic
-
అరె.. అచ్చం 'సైనా'లానే ఉంది కదూ..
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తీస్తున్నచిత్రం ‘సైనా’. బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా సైనా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక సైనా పాత్రలో నటించడానికి పరిణీతి చాలా సాధన చేసినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో ఉన్న పరిణీతి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో సైనా నెహ్వాల్‌తో పాటు పరిణీతి కూడా ఉన్న ఫోటో కొలేజీని సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఈ ఫోటోలో ఇద్దరూ ఒకేలా కనిపించడం విశేషం. శరీరాకృతి, డ్రెస్సింగ్, హెయిర్‌స్టయిల్ సహా సైనా మెడలోని చెయిన్‌తో సహా అచ్చం సైనాలానే పరిణీతి కనిపిస్తోంది. దీంతో సైనాకు కార్బన్ కాపీలా ఉంది, గ్రేట్ వర్క్ అంటూ పరిణీతిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన జీవితంలో నటిగా ఒక్కసారైనా ఇలాంటి పాత్ర పోషించినందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని పరిణీతి పేర్కొంది. View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) ఇక ఈ సినిమా కోసం బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా తన ప్రయాణం ఎలా సాగిందో వివరిస్తూ ఇటీవలె పరిణీతి ఓ వీడియోను పంచుకుంది. ఇందులో తాను బ్యాడ్మింటన్ నేర్చుకొని సైనాలాగే మారడానికి ఎంత కష్టపడిందో వివరించింది.ఈ పాత్ర కోసం పొద్దున్నే నిద్రలేచి కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని. కేవలం లుక్స్ పరంగానే కాకుండా సైనాలాగా ఆడటంలో మెరుగులు నేర్చుకోకపోతే ఎప్పటికీ ఈ పాత్రకు న్యాయం చేయలేను అనిపించేది. ఒక్కోసారి అసలు నేను ఈ రోల్ చేయగలనా లేదా అని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి' అని పరిణీతి పేర్కొంది. ఈ పాత్ర కోసం పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపిన విషయం తెలిసిందే. అమోల్ గుప్తా దర్శకత్వం వహించిన ‘సైనా’ మూవీ మార్చి 26 ప్రేక్షకుల ముందకు రానుంది. చదవండి : (బ్యాడ్మింటన్‌కు టెన్నిస్‌కు తేడా తెలీదా?) (నా భర్త వేధించాడు, పిల్లలే సాక్ష్యం: ప్రముఖ నటి) -
బ్యాడ్మింటన్‌కు టెన్నిస్‌కు తేడా తెలీదా?
బయోపిక్‌లకు అన్ని ఇండస్ట్రీలలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వీటి సంఖ్య అధికంగా పెరిగింది. ముఖ్యంగా అందులో టైటిల్ రోల్ చేసే ఆర్టిస్ట్ మీద అందరి దృష్టి ఉంటుంది. లుక్ సరిగ్గా సెట్ అయిందా? అని చూస్తుంటారు. అలాగే జీవితకథలో లేనివి కల్పించారా? లేదా ఏదైనా పొరపాటు చేశారా? అని భూతద్దంలో వెతుకుతారు. తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తీస్తున్న ‘సైనా’ పోస్టర్లో కొందరు ఓ తప్పుని పట్టుకున్నారు. సైనా పాత్రలో పరిణీతీ చోప్రా నటిస్తుండగా అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించి, పోస్టర్ని విడుదల చేశారు. సర్వీస్‌కి సిద్ధమవుతున్న చెయ్యితో పోస్టర్ని విడుదల చేశారు. అయితే బ్యాడ్మింటన్ సర్వీస్ ఈ పద్ధతిలో ఉండదని, ఇది టెన్నిస్ సర్వ్‌లా ఉందని, ఇంత పెద్ద తప్పుని సినిమా యూనిట్ ఎందుకు పట్టుకోలేకపోయిందని ఓ నెటిజన్ విమర్శించగా, పోస్టర్లో చెయ్యి కనబడిన విధానం ‘టెన్నిస్ సర్వ్’లానే ఉందని మరికొందరు నెటిజన్లు విమర్శించారు. కొందరు నెటిజన్లు మాత్రం పోస్టర్ చాలా బాగుందని ప్రశంసించారు. ఇలా పోస్టర్ విడుదలైన రోజునే మిశ్రమ స్పందన లభించడం చిత్రబృందానికి షాకింగ్‌గానే ఉంటుందని చెప్పొచ్చు. చదవండి: అవకాశం వస్తే.. ఆ అధ్యాయాన్ని చెరిపేస్తా : నటి -
‘మంచి భార్య రావాలని కోరుకోలేదు’
‘ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత అద్భుతమైన మహిళవు నువ్వు. మంచి భార్య రావాలని నేను ఏనాడు కోరుకోలేదు. మనం ఒక్కటై గడిచిన.. ఈ ఏడాదిని అద్భుతంగా మలిచినందుకు నీకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అంటూ భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన భార్య, స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై ప్రేమ చాటుకున్నాడు. మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో సైనా- కశ్యప్‌లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సైనా సైతం తమ మొదటి పెళ్లిరోజును పురస్కరించుకుని... భర్తతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. కాగా దాదాపు పదేళ్లపాటు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన సైనా- కశ్యప్ గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాయదుర్గంలోని సైనా నివాసం ఓరియన్ విల్లాలో ఈ రాకెట్ స్టార్స్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అత్యంత నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమానికి ఇరువైపుల బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం సినీ, క్రీడా ప్రముఖుల కోసం ఈ జంట నోవాటెల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఇక భారత బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా ఎదిగిన సైనా.. ఈ విభాగంలో భారత్‌కు ఒలింపిక్ పతకం అందించిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి ఈ ఘనత దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రపంచ బ్మాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో నంబర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో సైనా జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ పరిణీతి చోప్రా సైనాగా అలరించనున్నారు. కాగా పారుపల్లి కశ్యప్ సైతం కీలక మ్యాచుల్లో విజయం సాధించి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. ఇక వీరిద్దరు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ నుంచి క్రీడా ప్రస్థానం మొదలుపెట్టారన్న సంగతి తెలిసిందే. View this post on Instagram You are simply the most amazing woman in the world. I couldn’t ask for a better wife. Thanks for making the first year together so wonderful. I love you so much. Happy anniversary!! 😘😘❤️ A post shared by Kashyap Parupalli (@parupallikashyap) on Dec 16, 2019 at 11:09am PST -
గాయపడ్డ హీరోయిన్.. మెడకు బ్యాండేజ్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైనా’. భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్లో భాగంగా పరిణీతి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ డ్యూడ్స్... ‘సైనా’ షూటింగ్ సమయంలో నాకు చిన్న గాయం కూడా కాకుండా నేను, చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ అది జరిగిపోయింది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత బ్యాడ్మింటన్ ఆడేందుకు మళ్లీ సిద్ధమైపోతాను అని పరిణీతి ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. మెడకు బ్యాండేజ్‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఈ క్రమంలో పరిణీతి త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇష్క్‌జాదే సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన పరిణీతి.. శుద్ధ్ దేశీ రొమాన్స్, దావత్-ఏ-ఇష్క్, నమస్తే ఇంగ్లండ్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె నటించిన కేసరి, జబరియా జోడి సినిమాలు ఈ ఏడాది విడుదల కాగా.. ప్రస్తుతం ఆమె సైనా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో సైనా పాత్రకు తొలుత శ్రద్ధా కపూర్‌ను తీసుకోగా.. ఇతర సినిమాల కారణంగా కాల్షీటు సర్దుబాటు చేయలేకపోవడంతో ఆ అవకాశం పరిణీతి వరించింది. కాగా పరిణీతి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రో కజిన్ అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Dude. Me and the entire team of Saina have been taking so much care that I shouldn't get an injury, but shit happens. Will rest it as much as I can before I can start playing badminton again. 🙏 #SainaNehwalBiopic A post shared by Parineeti Chopra (@parineetichopra) on Nov 15, 2019 at 4:33am PST -
పూరీ... చోలే కర్రీ... శ్రద్ధగా తిన్నానోయి!
సాహో’ సెట్స్లోనైనా... సైనా నెహ్వాల్ ఇంట్లోనైనా... కుమ్ముడే కుమ్ముడు! శ్రద్ధా కపూర్ ఏమాత్రం తగ్గడం లేదు. ముద్దు ముద్దుగా వడ్డిస్తుంటే వద్దనకుండా ఫుల్లుగా లాగించేస్తున్నారు. ‘సాహో’ సెట్స్‌లో ప్రభాస్ అండ్ కో ఆతిథ్యాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ, శ్రద్ధగా తింటున్నానోయి అని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్స్ ఇస్తున్న ఈ ముంబయ్ బ్యూటీ, హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇంటికి వెళ్లినప్పుడూ సేమ్ ట్రెండ్ ఫాలో అయ్యారు. సైనా బయోపిక్‌లో శ్రద్ధా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ముంబయ్ వెళ్లే ముందు సైనా నెహ్వాల్ ఇంటికి వెళ్లారీ హీరోయిన్. ‘‘ఆంటీ (సైనా అమ్మ) చాలా ముద్దు చేశారు. పూరీ, చోలే కర్రీ, హల్వా, ఫ్రూట్ జ్యూస్... బాగా తిన్నానోయి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధా పేర్కొన్నారు.