అలాంటి వ్యక్తినే పెళ్లాడతా!
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు చెబుతుంటారు. అందుకే, జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలని అంటారు. కాబోయే భర్త గురించి ప్రతి అమ్మాయికీ, కట్టుకునే భార్య గురించి ప్రతి అబ్బాయికీ కొన్ని కలలు ఉంటాయి. ‘ఇలాంటి వ్యక్తిని పెళ్లాడితే మిగతా జీవితం బాగుంటుంది’ అని ఆ వ్యక్తి ఎలా ఉండాలో, అతని గుణాలు ఎలా ఉండాలో కూడా ఊహించుకుంటారు. ఓ సందర్భంలో పెళ్లి గురించి శ్రుతీహాసన్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘రైట్ టైమ్ వచ్చినప్పుడు నా పెళ్లవుతుంది’ అన్నారు. మీక్కాబోయే భర్త ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? నటుణ్ణి పెళ్లాడతారా?
సోర్ట్స్ మ్యాన్ అయితే బాగుంటుందనుకుంటున్నారా? మ్యూజిక్ ఫీల్డ్ అయితే బెస్ట్ అనే ఫీలింగ్ ఉందా? లేక నైన్ టూ సిక్స్ జాబ్ చేసే అబ్బాయి చాలనుకుంటు న్నారా? అనే ఆప్షన్స్‌ని శ్రుతీహాసన్ ముందుంచితే - ‘‘ర్యాన్ గోస్లింగ్ (కెనడియన్ నటుడు, సంగీత దర్శకుడు)లా హాట్‌గా కనిపించే న్యూక్లియర్ ఫిజిస్ట్‌ని పెళ్లాడాలని ఉంది. అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ గురించి చెప్పాలంటే.. సంగీతదర్శకుణ్ణి లేకపోతే నటుణ్ణి పెళ్లాడతా.
మంచి రచయితతో పెళ్లి కుదిరినా హ్యాపీయే’’ అన్నారు. మరి.. శ్రుతీహాసన్ కోరుకున్నట్లే జరుగు తుందా? లేక ఆమె కోరుకున్నదానికి వ్యతిరేకంగా వేరే రంగానికి చెందిన వ్యక్తితోనే ఆమె వివాహ బంధం ముడిపడుతుందా? అనేది కాలమే చెప్పాలి.