
ఫైల్ ఫోటో (ఇన్‌సెట్లో జేసుదాసు తమ్ముడు కేజే జస్టిన్)
తిరువనంతపురం : ప్రముఖ గాయకులు కేజే జేసుదాసు (యేసుదాసు) సోదరుడు కేజే జస్టిన్ అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. కేరళలోని కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కొచ్చిన్ వల్లర్పాడమ్ కంటైనర్ టెర్మినల్ సమీపంలో జస్టిన్ శవం తేలుతూ కనిపించింది. అగస్టీన్ జోసెఫ్, ఎలిజిబెత్ జోసెఫ్ దంపతులకు అయిదుగురు సంతానం. అందులో జేసుదాసు మొదటివాడు. ఆయన సొంత సోదరుడే కేజే జస్టిన్. ఈయన సంగీత కారుడు, నాటక రచయిత.
బుధవారం ఉదయం చర్చికి వెళ్లిన జస్టిన్ రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెతకగా ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులను సంప్రదించారు. బుధవారం త్రికక్కర పోలీసులు బ్యాక్ వాటర్స్ నుంచి జస్టిస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కొడుకు మరణంతో జస్టిన్ కొంతకాలం నుంచి మనో వేదనకు గురవుతునట్లు, అంతేకాకుండా ఆయనకు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment