అప్పుడు ఏడ్చేశా! | Sitara with Samantha Ruth Prabhu at Brahmotsavam | Sakshi
Sakshi News home page

అప్పుడు ఏడ్చేశా!

Published Tue, May 10 2016 10:38 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

అప్పుడు ఏడ్చేశా! - Sakshi

అప్పుడు ఏడ్చేశా!

ఈ సమ్మర్ మొత్తం సమంతదే. తమిళంలో ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’), తాజాగా ‘24’తో తెరపై మెరిశారు. ఇదే సమ్మర్‌లో ‘బ్రహ్మోత్సవం’, ‘అ..ఆ’ కూడా విడుదల కానున్నాయి. ఈ నాలుగు సిని మాల్లో ఇప్పటికే రెండు హిట్టయ్యాయి. మిగతా రెండూ హిట్టవుతాయనే నమ్మకం ఉందని అంటు న్నారు సమంత. ‘24’ విజయానందాన్ని పంచు కుంటూ సమంత చెప్పిన ముచ్చట్లు...
 
  ‘24’ ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాలో రాని కాన్సెప్ట్.  చాలా క్లిష్టమైన పాయింట్. సరిగ్గా తీయకపోతే అర్థం కాదు.  ‘ఈగ’ కథ విన్నప్పుడు అసలు ఆడియన్స్‌కు ఎలా కనెక్ట్ అవుతుందా? అనిపించింది.  ‘24’ కథ విన్నప్పుడూ ఇదే ఫీలింగ్. ఇలాంటి సినిమాల్లో రిస్క్ కూడా ఎక్కువే.  ఇలాంటి డిఫరెంట్ కథలతో సినిమా తీస్తున్నప్పుడు నా పాత్ర చిన్నదైనా సరే ఒప్పుకోవాలనుకుంటా. అందుకే చేశాను. లక్కీగా, రెండు సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. కొత్త కాన్సెప్ట్‌తో తీసిన ‘24’లో నేను కాసేపు కనిపించినా చాలనే స్వార్థంతో చేశా. కానీ, ‘అ..ఆ’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో  నా క్యారెక్టర్స్ అలా వచ్చి వెళిపోయేవి కావు. చాలా స్ట్రాంగ్ రోల్స్. ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా సరే నా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది.
 
  ఎనిమిది నెలలుగా చాలా బిజీబిజీగా గడిపేశాను. అందుకే ఇంకొన్నాళ్లు కొత్త సినిమాలు కమిట్ కాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాన్ని చెప్పాలి. రెండు నెలల క్రితం అనుకుంటా. పుణేలో ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్  పూర్తిచేసుకుని, ఉదయానికల్లా ‘24’ ప్రచారం కోసం చెన్నైలో ఉండాలి. తెల్లవారుజామున ఒంటిగంట టైమ్‌లో చెన్నై చేరుకుని కారులో ఒంటరిగా వెళుతున్నా. ఆ జర్నీలో ఏదో అలజడిగా, ఒత్తిడిగా అనిపించింది. అది తట్టుకోలేక ఒక్కసారిగా ఏడ్చేశా. ఇలా ఒక్కోసారి నాకు తెలియకుండానే ఎమోషనల్ అయిపోయేదాన్ని. ఎందుకంటే ఒక్క రోజు కూడా రెస్ట్ ఉండేది కాదు. ముఖ్యంగా సినిమా విడుదలప్పుడు చాలా టెన్షన్‌గా ఉంటా. రిలీజ్‌కు ముందు రెండు రోజులు నాకు నిద్ర పట్టదు. ఈ ఎనిమిది నెలల్లో ఈ బిజీ షెడ్యూల్ కారణంగా నా కుటుంబానికి కూడా టైం కేటాయించలేకపోయా. వారి మీదే నా కోపాన్నీ, నా బాధనీ వెళ్లగక్కేదాన్ని.
 
  ‘బ్రహ్మోత్సవం’ లొకేషన్‌లో నేను, మహేశ్ కూతురు సితార బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. తన డ్యాన్స్, పాటలు...ఇవన్నీ చూస్తే మహేశ్ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్‌సూపర్ స్టార్ సితార అనే అనిపిస్తోంది.  ఇలా చెబితే, మహేశ్ నన్ను చంపేస్తాడు (నవ్వుతూ). ‘బ్రహ్మోత్సవం’లో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ‘అ..ఆ’లో నేనెప్పుడూ ట్రై చేయని కామెడీ యాంగిల్‌ని కూడా చేశాను. మంచి కథ వస్తే, డార్క్ రోల్స్ చేయడానికి రెడీ.
 
♦  కన్నడంలో వచ్చిన ‘యూ టర్న్’ అనే సినిమా తెలుగు, తమిళ రీమేక్‌లో నటించాలనుకుంటున్నా. ఈ సినిమా చేయాలనే నిర్ణయం ఎప్పుడో తీసుకున్నది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. కానీ, ఆ సినిమాను నేను నిర్మించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement