
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లోని డైలాగ్స్‌కు సంబంధించిన క్విజ్ ఇది. ఈ వారం స్పెషల్.
► ‘పొగరు నా ఒంట్లో ఉంటుంది. హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది..’ అనే డైలాగ్ చెప్పిన హీరో ఎవరు?
ఎ) వరుణ్ తేజ్ బి) రామ్‌చరణ్ సి) సాయిధరమ్ తేజ్ డి) చిరంజీవి
► ‘ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేళ్లు కాదు తల..’ అంటూ తలనరికే సన్నివేశం ఏ చిత్రం లోనిది?
ఎ) గౌతమిపుత్ర శాతకర్ణి బి) బాహుబలి ది కంక్లూజన్ సి) అదిరింది డి) ఇంద్రసేన
► ఐయామ్ బ్లైండ్... బట్ ఐయామ్ ట్రైన్డ్’ అని రవితేజ చెప్పిన డైలాగ్ ‘రాజా ది గ్రేట్’ సినిమాలోనిది. ఈ డైలాగ్ రాసిందెవరు?
ఎ) అనిల్ రావిపూడి బి) బీవీయస్ రవి సి) చిన్నికృష్ణ డి) ఆనంద్ రవి
► ‘మంచితనం.. అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది. మనలో ఉంటే గుణపాఠం అవుతుంది..’ అనే డైలాగ్ చెప్పిన హీరో ఎవరు?
ఎ) ఎన్టీఆర్ బి) కల్యాణ్ రామ్ సి) నితిన్ డి) నాని
► ‘నేను నీలా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, పెద్ద బాలశిక్ష చదువుకున్నానంతే..’ అనే డైలాగ్ చెప్పిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో కనుక్కోండి?
ఎ) కోట శ్రీనివాసరావు బి) రావు రమేశ్ సి) బ్రహ్మానందం డి) నాగినీడు
► ‘పేరు పెట్టి పిలిస్తే పిలుపుంటుంది. బంధుత్వంతో పిలిస్తే బంధం ఉంటుంది’. ఏ సినిమాలోనిది ఈ డైలాగ్?
ఎ) నిన్ను కోరి బి) నేను లోకల్ సి) జై లవకుశ డి) శతమానం భవతి
► ‘ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్లారు. ఇప్పుడొచ్చి సరాసరి బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా?’ అని హీరోని అడిగే హీరోయిన్ ఎవరు?
ఎ) త్రిష బి) శ్రియ సి) అంజలి డి) అనుష్క
► ‘పాముకి పుట్ట కావాలంటే చీమలే కదా కష్టపడాలి’ అని డైలాగ్ చెప్పిన హీరో ఎవరు?
ఎ) రానా బి) శర్వానంద్ సి) సందీప్ కిషన్ డి) వరుణ్ తేజ్
► ‘నువ్వు ఊపిరి తీసుకునే విధానం నాకిష్టం, ఐ లవ్ ద వే యు బ్రీత్’ అనే డైలాగ్ చెప్పే హీరో ఎవరు?
ఎ) నారా రోహిత్ బి) శ్రీవిష్ణు సి) విజయ్ దేవరకొండ డి) సాయిరామ్ శంకÆŠ
► ‘మనం దేన్నైతే అసహ్యించుకుంటామో దేవుడు అందులోనే ముంచి లేపుతాడు’ అనేది ‘మహానుభావుడు’ సినిమాలో డైలాగ్. ఈ డైలాగ్ చెప్పిన కమెడియన్ ఎవరు?
ఎ) భద్రం బి) Ðð న్నెల కిశోర్ సి) టిల్లు వేణు డి) రఘుబాబు
► ‘సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?’ ఈ డైలాగ్‌ను రాసిన రచయిత ఎవరో తెలుసా?
ఎ) జనార్ధన మహర్షి బి) సాయిమాధవ్ బుర్రా సి) క్రిష్ డి) పరుచూరి బ్రదర్స్‡
► ‘భ్రమరాంబకి కోపమొచ్చింది... శివగాడికి చిరాకొచ్చింది.. అయితే ఏంటి?’ అన్నది హీరో, హీరోయిన్ మధ్య జరిగే సంభాషణ. హీరో నాగ చైతన్య.. మరి హీరోయిన్ ఎవరో కనుక్కోండి?
ఎ) సమంత బి) రాశీఖన్నా సి) రకుల్‌ప్రీత్ సింగ్ డి) లావణ్యత్రిపాఠి
► ‘ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కారు బాస్ .. అన్ని అలవాట్లు ఉన్నోణ్ణి ప్రేమిస్తారు. ఏ అలవాటు లేనోణ్ణి ò³ళ్లి చేసుకుంటారు..’ అని హీరో నాని ఎవరితో ఈ డైలాగులు చెప్తాడు?
ఎ) మురళీ శర్మ బి) ఆది పినిశెట్టి సి) పృథ్వీ డి) తనికెళ్ల భరణి
► ‘భూమ్మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు తప్పవు బావ..’ అనే డైలాగ్ చెప్పిన హీరో ఎవరు?
ఎ) మంచు విష్ణు బి) మంచు మనోజ్ సి) నవీన్‌చంద్ర డి) నాగశౌర్య
► ‘జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళ్తుంది. కానీ, ప్రేమ జీవితం ఉన్న చోటుకే తీసుకెళ్తుంది..’ అనే డైలాగ్ ఏ సినిమాలోనిది?
ఎ) విన్నర్ బి) మిస్టర్ సి) గుంటూరోడు డి) ఒక్కడు మిగిలాడు
► ‘ఈ రోజుల్లో మనం అనాల్సింది బుధ్ధం శరణం గచ్ఛామి కాదు సార్.. యుద్ధం శరణం గచ్ఛామి..’ అని ఏ హీరో డైలాగ్ చెప్పాడో కనిపెట్టేస్తారా?
ఎ) అల్లు అర్జున్ బి) ఎన్టీఆర్ సి) వెంకటేశ్ డి) నాగార్జున
► ‘భయపెట్టడం మాకూ తెలుసు’ అని ‘స్పైడర్’ సినిమాలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్ రాసిందెవరు?
ఎ) ఏఆర్ మురుగదాస్ బి) పరుచూరి బ్రదర్స్ సి) శ్రీరామకృష్ణ డి) అబ్బూరి రవి
► ‘బలహీనత లేని బలవంతుణ్ణి భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు..’ డైలాగ్ రాసింది దర్శకుడు హను రాఘవపూడి. చెప్పిన హీరో ఎవరు?
ఎ) శర్వానంద్ బి) నితిన్ సి) నాని డి) అర్జున్ సజ్జా
► ‘మనకు గతంలో జరిగిన విషయాలు చెబితే వినేవాడు ఫ్రెండ్. కానీ, ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్..’ అనే డైలాగ్ చెప్పిన హీరో ఎవరు?
ఎ) నిఖిల్ బి) రామ్ సి) శ్రీవిష్ణు డి) కార్తీ
► ‘తిక్కుంటే లెక్కుండాలి.. ఈ పిల్లకి ఓన్లీ తిక్క నో లెక్క..’ అని హీరో వరుణ్‌తేజ్ ఏ హీరోయిన్‌ని ఉద్దేశించి మాట్లాడతాడు?
ఎ) కీర్తీ సురేష్ బి) హె బ్బా పటేల్ సి) సాయిపల్లవి డి) పూజా హెగ్డే
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) డి 2) బి 3) ఎ 4) ఎ 5) బి 6) డి 7) బి 8) ఎ 9) సి 10) బి 11) బి 12) సి 13) బి 14) బి 15) బి 16) ఎ 17) ఎ 18) బి 19) బి 20) సి
Comments
Please login to add a commentAdd a comment