సల్మాన్‌ ట్వీట్‌: విమర్శలు గుప్పించిన సింగర్‌‌! | Sona Mohapatra Slams Salman Khan Over His Tweet On Sushant Singh Suicide | Sakshi
Sakshi News home page

‘మనసున్న పురుషుడి నుంచి పెద్ద కదలిక’

Published Tue, Jun 23 2020 9:04 AM | Last Updated on Tue, Jun 23 2020 11:47 AM

Sona Mohapatra Slams Salman Khan Over His Tweet On Sushant Singh Suicide - Sakshi

ముంబై: బాలీవుడ్‌ గాయని సోనా మహపాత్రా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌పై వ్యంగ్యాస్త్రాలు సందించారు. యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మరణంపై స్పందిస్తూ ఇటీవల సల్మాన్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. భాయిజాన్‌ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ సోనా సోమవారం సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ‌‘పెద్ద మనసున్న వ్యక్తి’ పీఆర్‌ మూవ్‌(అందరి దృష్టిలో మంచివాడిగా నటించడం), అంతేగాక ‘పోస్టర్‌ బాయ్‌ ఆఫ్‌ టాక్సిక్‌ మస్కిలినిటీ’(విషపూరిత ‍పురుష స్వభావానికి కేరాఫ్‌ అడ్రస్‌) అంటూ సల్మాన్‌పై విరుచుకుపడ్డారు. (సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌: స‌్పందించిన స‌ల్మాన్)

సోనా ట్వీట్‌ చేస్తూ... ‘‘విషపూరితమైన పురుష స్వభావం కలవాడైన ఓ వ్యక్తి నుంచి పెద్ద హృదరయపూర్వక కదలిక(పీఆర్‌ మూవ్‌). తన డిజిటల్‌ చెల్లింపు సైన్యం గతంలో ఇతరులను బెదిరించినప్పుడు ఒక ట్వీట్‌ లేదా క్షమాపణలు అనవసరమని భావించిన పెద్ద మనుషున్న వ్యక్తి నుంచి ఇది అతిపెద్ద కదలిక’’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా సుశాంత్‌ ఆత్మహత్య నేపథ్యంలో కొంతమంది బాలీవుడ్‌ ప్రుముఖులు కరణ్‌ జోహార్‌, సల్మాన్‌ ఖాన్‌, స్టార్‌ కిడ్స్‌పై విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్‌ పెరుకుపోయిన బంధుప్రీతి(నెపోటిజం) వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో #BoycottKhans‌ అనే పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ వైరల్‌‌ అవుతోంది.  (సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన సింగర్‌ సోనా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement