Sona Mohapatra
-
‘జీన్స్.. టీషర్టు.. ఆ అవతారమేంటి’; గుండె పగిలి ఆమె ఏడుస్తుంటే..
ముంబై: ‘‘అయ్యో.. అదేమిటి.. కొడుకు ఉండగా భార్య అంత్యక్రియలు చేయడమేంటి? పైగా జీన్స్.. టీ షర్టు, చెప్పులు, చేతికి వాచీ.. ఆ అవతారమేమిటి. ఇదెక్కడి చోద్యం. ఎందుకు ఈమె ఇలా చేసింది. సెలబ్రిటీ అయితే మాత్రం ఏం చేసినా చెల్లుతుందా. అసలు ఏమనుకుంటోంది’’.. మందిరా బేడీని ఉద్దేశించి కొంతమంది నెటిజన్లు చేస్తున్న తీవ్ర విమర్శలు ఇవి. భర్త అంతిమ సంస్కారాలను స్వయంగా నిర్వర్తించినందుకు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించిందంటూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మందిరకు పలువురు సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. భర్తపై ఆమె ప్రేమను చూడాలే తప్ప.. ఇలా విద్వేషపూరితంగా వ్యవహరించడం సరికాదని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, సింగర్ సోనా మొహాపాత్ర మాత్రం ట్రోల్స్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇంతకంటే పిచ్చితనం ఏమీ ఉండదంటూ మందిరను టార్గెట్ చేసిన వారికి చురకలు అంటించారు. ఈ మేరకు... ‘‘తన భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియల సమయంలో మందిరా బేడి ధరించిన దుస్తులపై కొంతమంది ఇంకా విపరీతపు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇవేమీ కొత్తకాదు. మనల్ని ఆశ్చర్యపరిచేవీ కావు. మన ప్రపంచంలో స్టుపిడిటీ కంటే ఇంకేదైనా పెద్ద విషయం ఉండదు కదా’’అంటూ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ఈ క్రమంలో పలువురు ఫాలోవర్లు సోనా పోస్టును అభినందిస్తున్నారు. ‘‘ ఆపత్కాలంలో సానుభూతి ప్రదర్శించాలే తప్ప.. ఆమె ఎలాంటి దుస్తులు వేసుకుంది. ఎలా రెడీ అయింది అంటూ కామెంట్లు చేయడం సిగ్గుచేటు. గుండె పగిలి ఆమె ఏడుస్తుంటే.. వీరికి మాత్రం కట్టూబొట్టూ గురించి కావాల్సి వచ్చిందా. మీరు చెప్పింది కరెక్ట్ సోనా. పిచ్చి పీక్స్‌కు వెళ్లింది చాలా మందికి’’ అంటూ మందిరకు అండగా నిలుస్తున్నారు. కాగా ప్రముఖ నటి మందిరా బేడి భర్త, ఫిల్మ్ మేకర్ రాజ్ కౌశల్(49) గుండెపోటుతో బుధవారం(జూన్ 30) కన్నుమూసిన విషయం విదితమే. ఈ క్రమంలో మందిరా తానే భర్తకు అంత్యక్రియలు నిర్వహించారు. వీరికి పదేళ్ల కుమారుడు వీర్, దత్తత కూతురు తార ఉన్నారు. ఓ సింగింగ్ షోలో సోనా మొహాపాత్ర That some people are still commenting on Mandira Bedi’s dress code or choice to carry out her husband Raj Kushal’s last rites shouldn’t surprise us. Stupidity is more abundant than any other element in our world after all .. — Sona Mohapatra (@sonamohapatra) July 2, 2021 -
‘రియా కోసం అతడి గుండె రక్తమోడుతోంది’
ముంబై: బాలీవుడ్ ప్రముఖ సింగర్ విశాల్ దద్లానీపై గాయని సోనా మహాపాత్ర విమర్శలు గుప్పించారు. కాలానికి, మనుషులకు తగ్గట్లుగా ఆయన మనసు మారిపోతూ ఉంటుందని వంగ్యాస్త్రాలు సంధించారు. కాగా నటి తనూ శ్రీ దత్తా నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణ నేపథ్యంలో బాలీవుడ్లో మీటూ ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోనా సహా పలువురు ఆమె మద్దతుగా నిలబడ్డారు. మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ జడ్జి, సంగీత దర్శకుడు అను మాలిక్ తమను లైంగికంగా వేధించాడంటూ పలువురు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అనూ మాలిక్‌కు వ్యతిరేకంగా సోనా బలంగా తన గొంతు వినిపించారు. బాధితుల పక్షాన నిలబడ్డారు. అయితే అనూ మాలిక్‌తో అదే వేదికను పంచుకున్న సింగర్ విశాల్ దద్లానీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టైన విషయం విదితమే. అనేక పరిణామాల అనంతరం వీరిద్దరికి బెయిలు లభించగా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఈ విషయం గురించి గురువారం ట్విటర్లో ప్రస్తావించిన విశాల్.. ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అక్కాతమ్ముళ్ల అందమైన భవిష్యత్తును నాశనం చేశారంటూ మండిపడ్డాడు. తన రాజకీయ గురువులను ప్రసన్నం చేసుకునేందుకే ఇలా చేశాడంటూ ఆరోపించాడు.(చదవండి: ‘బెల్ట్ తీసి కొట్టేవాడు.. వేళ్లు విరిచేవాడు’) ఈ విషయంపై స్పందించిన ఓ నెటిజన్.. గురువుల మెప్పు పొందేందుకు మీటూ ఉద్యమం గురించి నోరు తెరవని నువ్వు ఇప్పుడిలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. అనుమాలిక్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని మీకు డబ్బు గురించి ఆలోచనే తప్ప ఇంకేమీ పట్టదంటూ ఘాటుగా విమర్శిస్తూ సోనా మహాపాత్రను ట్యాగ్ చేశారు. ఇందుకు బదులుగా.. ‘‘ మన అవసరాన్ని, సౌలభ్యాన్ని బట్టి ఏది సరైంది, ఏది కాదు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. రియా చక్రవర్తి కోసం దద్లానీ గుండె రక్తమోడుతోంది. కానీ ఇండియన్ ఐడల్‌లో ఆయన సహచరుడు అనూ మాలిక్ గురించి ఎంతో మంది మహిళలు ఆరోపణలు చేసినప్పుడు మాత్రం ఎలాంటి న్యాయన్యాయాలు గుర్తుకురాలేదు’’ అంటూ విమర్శించారు. “What is right is often forgotten by what is convenience.” Dadlani’s heart bleeds for Rhea Chakraborty & 🤟🏾🙏🏾.None of this justice bent came into play for Vishal when endless women called out his #IndianIdol colleague Anu Malik. @IndiaMeToo .#WontBeForgotten #India #WillRemember https://t.co/tHwsaXKdhC — Sona Mohapatra (@sonamohapatra) December 10, 2020 -
చున్నీ సరిగా వేసుకోమన్నారు: సింగర్
మీటూ మూమెంట్‌కు పూర్తి స్థాయి మద్దతు తెలిపిన సింగర్ సోనా మొహపాత్ర ఇప్పుడో కొత్త చాలెంజ్‌కు తెర తీశారు. 'ఐ నెవర్ ఆస్క్ ఫర్ ఇట్' పేరిట బాధితులనే బాధ్యులుగా చేసిన సంఘటనల గురించి నిర్మొహమాటంగా, నిర్భయంగా స్పందించాలని పిలుపునిచ్చారు. ప్రతిదానికి బాధితులనే తప్పుపట్టడం ఆపేయాలని కోరారు. ముందుగా ఆమె తన కాలేజీలో జరిగిన ఈవ్ టీజింగ్ గురించి చెప్పుకొచ్చారు. 'నేను బీటెక్ చదువుతున్న చదువుతున్న రోజులవి.. సల్వార్ దుస్తులు ధరించిన నేను మైక్రోప్రాసెస్ ల్యాబ్‌కు వెళ్తున్నా. అక్కడ ఉన్న సీనియర్లు నన్ను చూసి విజిల్స్ వేశారు. నా లోదుస్తుల గురించి అందరికీ వినబడేలా ఏవేవో కామెంట్లు చేశారు. అది చూసిన ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి.. ఎక్స్పోజింగ్ చేయకుండా చున్నీ సరిగా వేసుకోవచ్చు కదా! అని సలహా ఇచ్చాడు' అని చెప్పుకొచ్చారు. (చదవండి: క్షేమం కోరి...) ఇలాంటి వేధింపులు మీకూ ఎదురైతే వాటిని పంచుకోండి అంటూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌తో పాటు సింగర్ చిన్మయిని కూడా తన ట్వీట్లో ట్యాగ్ చేశారు. కాగా సంగీత దర్శకుడు అను మాలిక్ తనను లైంగింకగా వేధించాడంటూ గతంలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో కొందరు ఆమెకు సపోర్ట్ చేయగా మరికొందరు మాత్రం ఆమెనే తిట్టిపోశారు. ఆరోపణలు చేసినందుకుగానూ సరిగమప షో జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమెను షో నుంచి వైదొలగాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. (చదవండి: టేకాఫ్‌కి ఆల్వేస్ రెడీ అంటున్న హీరోయిన్లు) -
సల్మాన్ ట్వీట్: విమర్శలు గుప్పించిన సింగర్!
ముంబై: బాలీవుడ్ గాయని సోనా మహపాత్రా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌పై వ్యంగ్యాస్త్రాలు సందించారు. యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై స్పందిస్తూ ఇటీవల సల్మాన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. భాయిజాన్ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ సోనా సోమవారం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ‘పెద్ద మనసున్న వ్యక్తి’ పీఆర్ మూవ్(అందరి దృష్టిలో మంచివాడిగా నటించడం), అంతేగాక ‘పోస్టర్ బాయ్ ఆఫ్ టాక్సిక్ మస్కిలినిటీ’(విషపూరిత పురుష స్వభావానికి కేరాఫ్ అడ్రస్) అంటూ సల్మాన్‌పై విరుచుకుపడ్డారు. (సుశాంత్ ఆత్మహత్య: స్పందించిన సల్మాన్) A ‘large hearted’ PR move from the one & only poster boy of toxic masculinity!👇🏾Of course he felt no such need to tweet or apologise for the vile threats that his digital paid army sent out to intimidate & bully others in the past. Got his dad to speak everytime he screwed up https://t.co/D3qKjx7PzM — Sona Mohapatra (@sonamohapatra) June 21, 2020 సోనా ట్వీట్ చేస్తూ... ‘‘విషపూరితమైన పురుష స్వభావం కలవాడైన ఓ వ్యక్తి నుంచి పెద్ద హృదరయపూర్వక కదలిక(పీఆర్ మూవ్). తన డిజిటల్ చెల్లింపు సైన్యం గతంలో ఇతరులను బెదిరించినప్పుడు ఒక ట్వీట్ లేదా క్షమాపణలు అనవసరమని భావించిన పెద్ద మనుషున్న వ్యక్తి నుంచి ఇది అతిపెద్ద కదలిక’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో కొంతమంది బాలీవుడ్ ప్రుముఖులు కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, స్టార్ కిడ్స్‌పై విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ పెరుకుపోయిన బంధుప్రీతి(నెపోటిజం) వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో #BoycottKhans అనే పేరుతో హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. (సల్మాన్‌ను టార్గెట్ చేసిన సింగర్ సోనా) -
సల్మాన్‌ను టార్గెట్ చేసిన సింగర్ సోనా
ముంబై: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో హింసాత్మక వీడియోలపై బాలీవుడ్ సింగర్ సోనా మెహపాత్రా స్పందించారు. మన సమాజంలో మహిళలపై హింసలు సర్వసాధారణమైనవని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. ఇటీవల అమీర్ సిద్ధీఖీ సోదరుడు ఫైజల్ సిద్దీఖీ చేసిన ఓ టిక్‌టాక్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో తనని వదిలేసిన యువతిపై ప్రతీకారం తీర్చుకునెందుకు ఆమె ముఖంపై యాసిడ్ పోసినట్లు చూపించిన ఈ వీడిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు. ఈ వీడియో మహిళలపై యాసిడ్ దాడిని ప్రొత్సహించేలా ఉందని, దీనిని తొలగించాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. (ఆర్జీవీ ట్వీట్.. మండిపడ్డ సింగర్!) Dear @aaliznat ,nothing before & after the ‘spliced’ video u were defending of this guy cd justify it.Demeaning women is normalised in our culture.We grew up with stories of SalmanKhan,breaking bottles on his girlfriends head in public,yet the country’s biggest star?Needs to stop https://t.co/poZ1VJrhrF — ShutUpSona (@sonamohapatra) May 18, 2020 ఇక అతడి ట్వీట్‌కు సోనా మద్దతునిస్తూ... ‘‘డియర్ @aaliznat మునుపుటికీ, ఇప్పటికి మహిళలను కించపరచడం, హింసించడం ఏమాత్రం మారలేదు. అదే మన స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చూస్తునే ఉన్నాం. ఆయన తన స్నేహితురాళ్ల నుదుటిపై బహిరంగంగా సీసాలు పగలగొట్టిన ఘటనలను పలుమార్లు చుశాం. అయినప్పటికీ ఆయన ఓ పెద్ద హీరో?. ఇది ఇప్పటికైన ఆపడం అవసరం’’ అంటూ ఆమె ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే సోనా సల్మాన్‌పై ఆరోపణలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఇది వరకు కూడా భారత్ సినిమా నుంచి చివరి నిమిషంలో ప్రియాంక చోప్రా తప్పుకొవడంపై కూడా ఆమె సల్మాన్‌పై ఆరోపణలు చేశారు. ‘ప్రియాంక తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ నిర్ణయంతో తను ఇతర అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు’ అని అన్నారు. కాగా అమిర్ సుద్దీఖీ సోదరుడు ఫైజల్ సోదరుడి టిక్‌టాక్ వీడియో హింసను ప్రేరింపించిందిగా ఉండటంతో ఆ సంస్థ దానిని తొలగించింది. -
ఆర్జీవీ ట్వీట్.. మండిపడ్డ సింగర్!
మద్యం కొనుగోలు చేసే మహిళలు గృహ హింసపై ఫిర్యాదు చేయడానికి అనర్హులంటూ వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోమవారం ట్వీట్ చేశాడు. లాక్డౌన్ దేశంలో పేరుగుతున్న గృహ హింస కేసుల నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి మద్యం దుకాణాల ప్రారంభానికి అనుమతించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే మహిళలపై గృహ హింస కేసులు పెరిగిన క్రమంలో ప్రభుత్వం మద్యం దుకాణాల తెరిస్తే ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని, అంతేగాక దీని ప్రభావం కుటుంబ సభ్యులపై, పిల్లలపై తీవ్రంగా చూపుతుందని వారు ధ్వజమెత్తారు. అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. వైన్ షాపుల ఎదుట మహిళలు వరుసలో నిలబడి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ‘‘చూడండి మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో. అవును పాపం తాగే పురుషుల నుంచి మహిళలను రక్షించడం చాలా ముఖ్యం’’ అంటూ తనదైన శైలిలో ఆర్జీవీ ట్వీట్ చేశాడు. (రంగోలికి సోనా మద్దతు.. సెలబ్రిటీల ఫైర్!) Dear Mr RGV,time for u to get into the line of people who desperately need a real education.1 that lets u understand why this tweet of yours reeks of sexism & misplaced morality.Women have a right to buy & consume alcohol just like men. No one has a right to be drunk & violent. https://t.co/5AUcTrAJrZ — ShutUpSona (@sonamohapatra) May 4, 2020 ఇక ఆర్జీవీ ట్వీట్‌కు బాలీవుడ్ సింగర్ సోనా మోహపత్రా స్పందిస్తూ.. ‘‘డియర్ మిస్టర్ ఆర్జీవీ. అసలైన విద్యావంతులు ఎలా ఉండాలని నేర్పించే వ్యక్తుల వరుసలో మిమ్మల్ని ఈ ట్వీట్ చేరుస్తుంది. మీ ట్వీట్ ఎందుకు సెక్సిజం, నైతికత రీక్స్ అర్థానికి వీలుగా ఉంది. మహిళలకు, పురుషుల మాదిరిగా మద్యం కొనుగోలు, మద్యం సేవించే హక్కు ఉంది. అయితే మద్యం సేవించాక హింసాత్మకంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు’’ అంటూ ఆర్జీవీపై ఆమె మండిపడ్డారు. కాగా మే 4 నుంచి లాక్డౌన్ మరోసారి పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా లాక్డౌన్ మూడవ దశలో కొన్ని రంగాలకు సడలింపులు ఇస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. ఇందులో మద్యం, పాన్, పొగాకు అమ్మకాలకు కూడా అనుమతించింది. అయితే మద్యం షాపులు తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్, నటి మలైకా అరోరా, రవీణా టాండన్‌లు వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. (వైన్ షాపుల మూతపై వర్మ ట్వీట్) -
రంగోలి ట్విటర్ బ్లాక్; ఖండించిన సింగర్
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ట్విటర్ ఖాతా తొలగింపుపై బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. గాయని సోనా మోహపత్రా మాత్రం దానిని ఖండించారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘కంగనా ఆమె సోదరి రంగోలిలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే హక్కు ఉందంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. దీనిని రాజకీయం చేయకుండా వెంటనే ఒకసారి ఆలోచండి #వోక్సభ’ అంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. అదే విధంగా ‘‘ఏ విషయాన్ని అయినా లోతుగా చూసే ప్రపంచంలో మనమంతా జీవిస్తున్నాము. ఇక్కడ ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఏకిభవించరు. దేశ పురోగతికి ఇది చెత్త ఫార్ములా. ఇక రంగోలీ ట్విటర్ ఖాతాను బలవంతంగా తొలగించి మరింత ద్వేషాన్ని స్వాగతించారు’’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. (రంగోలి ట్విటర్ అకౌంట్‌ను తొలగించిన అధికారులు) Just read on my timeline that the ‘Rangoli Chandel-Kangana Ranaut’ handle has been suspended by @twitter ? While I might not subscribe to all their views,I also stand by their right to express them.Let’s not be so ‘politically correct’ & quick to be offended dear #WokeSabha 🧚🏿♀️🔴 — ShutUpSona (@sonamohapatra) April 16, 2020 ఇక సోనా మోహపత్రా ట్వీట్‌కు దర్శకురాలు రీమా కగ్టి, రంగోలీ ట్వీట్‌ను షేర్ చేస్తూ.. ‘‘సోనా మీరు దీనికి మద్దతు ఇవ్వాల్సిందే. ఈ ట్వీట్‌ను మీరు చుశారో లేదో నాకు తెలియదు. అయితే ఈ ట్వీట్‌ను ఓసారి చూడండి. ఇందులో ఒక నిర్థిష్ట వర్గానికి చెందిన వ్యక్తులను, నిర్థిష్టమైన పత్రికలను మారణ హెమానికి పిలుపునిచ్చింది. ఇది నేరం. ఆమోద యోగ్యం కానిది’’ అంటూ సోనా ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. ఇక దీనికి సోనమ్ మరో ట్వీట్ చేస్తూ ‘‘అవును ఇప్పుడే ఆ వివాదస్పద ట్వీట్‌ను చుశాను. అయితే దీనికి రద్దు చేయడమే పరిష్కారం కాదు. ఇలాంటి పద్దతిని సమర్థించను. ఎలాంటి వారినైనా క్షమించి వారి ఉదారవాదాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా’’ అని వివరణ ఇచ్చారు. (రంగోలి సంచలన వ్యాఖ్యలు) కాగా ఫైర్ బ్రాండ్ రంగోలి తన అభిప్రాయాలను సోషల్ మీడయాలో తెలుపుతూ ఏప్పుడు వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్ మీడియాను కాల్చి చంపాలని రంగోలి తన ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. దీంతో ఆమె ట్విటర్ ఖాతాను అధికారులు గురువారం రద్దు చేశారు. -
షాహిద్.. ఏంటిది?!
షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘కబీర్ సింగ్’పై గాయని సోనా మహాపాత్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి క్యారెక్టర్లు చేయడం ద్వారా సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారంటూ షాహిద్‌పై మండిపడ్డారు. బాధ్యతరాహిత్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు. టీవీ యాక్టర్ నకుల్ మెహతా కబీర్ సింగ్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ..‘ 99 సమస్యలు ఉండనీ. షాహిద్ కపూర్ మాత్రం అందులో ఒకడు కాదు. కాసేపు రాజకీయాలను పక్కనపెడితే కబీర్ సింగ్ ఓ అద్భుత వర్ణన. ఈ సినిమాలోని ప్రతీ ఫ్రేమ్‌లో ప్రతీ ఒక్కరు తమను తాము చూసుకుంటున్నారు అంటూ ట్వీట్ చేశాడు. అదే విధంగా జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ కూడా సోషల్ మీడియా వేదికగా ‘కబీర్ సింగ్’ సినిమాలో షాహిద్ నటనను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో వీరివురి ట్వీట్లపై స్పందించిన సోనా...‘ మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, పితృస్వామ్య వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్న ఈ సినిమాను మీరు పూర్తిగా గమనించలేదా. కేవలం నటనను మాత్రమే చూస్తారా? మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. భారత్‌లో మహిళలకు ఉన్న స్థానం గురించి పునరాలోచించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సినిమాల ద్వారా ఏం చెప్పదలచుకున్నారు’ అని ప్రశ్నించారు. అయితే సోనా ట్వీట్‌పై నెటిజన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు ‘కబీర్ సింగ్’ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. -
ముంబై గ్యాంగ్ రేప్ పై సోనమ్ కపూర్ నిరసన