శ్రీదేవి, జాహ్నవి.. వీడియో వైరల్‌ | Sridevi Imitated Jhanvi Kapoors Hindi accent Video Viral | Sakshi
Sakshi News home page

శ్రీదేవి, జాహ్నవి.. వీడియో వైరల్‌

Published Tue, May 1 2018 1:12 PM | Last Updated on Tue, May 1 2018 4:47 PM

Sridevi Imitated Jhanvi Kapoors Hindi accent Video Viral - Sakshi

బాలీవుడ్‌లో ‘లేడి సూపర్‌స్టార్‌’గా గుర్తింపు తెచ్చుకున్న తొలి హీరోయిన్‌ శ్రీదేవి. అందం, అభినయానికి చిరునామగా నిలిచిన శ్రీదేవి హఠాన్మరణాన్ని ఆమె అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నటిగానే కాదు నిజ జీవితంలో తల్లి పాత్రను అంతే సమర్ధవంతంగా పోషించారు శ్రీదేవి. పెద్దకూతురు జాహ్నవి కపూర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేయడానికి ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం ఈ తల్లికూతుళ్లకు సంబంధి​చి ఒక ఆసక్తికర వీడియో వైరల్‌గా మారింది. విషయమేంటంటే జాహ్నవికి తొలుత హిందిలో మాట్లడటం సరిగా వచ్చేది కాదంట.

జాహ్నవి పాఠశాలలో చదువుతున్న సమయంలో తల్లి శ్రీదేవితో కలిసి ఒక మీడియా సమావేశానికి హజరయ్యారు. ఆ సమయంలో విలేకరులు జాహ్నవిని తమ ప్రశ్నలకు హిందీలోనే సమాధానాలు చెప్పాలని కోరారు. దాంతో జాహ్నవి తనకు వచ్చిన బ్రోకెన్‌ హిందీలోనే సమాధానాలు చెప్పారు. పక్కనే ఉన్న  శ్రీదేవి జాహ్నవిని హిందీలో మాట్లడించవద్దంటూ విలేకరులను కోరారు. జాహ్నవి హిందీలో ఎలా మాట్లడుతుందో శ్రీదేవి అనుకరించి చూపించేసరికి జాహ్నవితోపాటు అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం జాహ్నవి కరణ్‌జోహర్‌ నిర్మిస్తున్న ‘ధడక్‌’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ‘ధడక్‌’ సినిమా మరాఠీ చిత్రం ‘సైరత్‌’కు రిమేక్‌. కాగా ఈ చిత్రం 2018, జూలై 20న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement