రాజమౌళి, కీరవాణి, శ్రీ సింహా, రితేష్ రానా, అతుల్య, చెర్రీ, కాలభైరవ
‘‘మత్తు వదలరా’ సినిమా చూశాను. తీపి, కారం ఒకేసారి తిన్నట్టు అనిపించింది. చూస్తున్న కొద్దీ సినిమా ఎంతో నచ్చేసింది. ప్రతి ఫ్రేమ్ నన్ను ఆకట్టుకుంది. ఇక జనాలకు నచ్చాలి’’ అని డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టై¯Œ మెంట్ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ– ‘‘రితేష్ ఐడియా నాకు బాగా నచ్చింది.
సింహా, కాలభైరవకు చక్కటి భవిష్యత్తు ఉంది. నా ‘యమదొంగ’ చిత్రానికి నిర్మాత చెర్రీనే. నా కెరీర్‌లో అతి తక్కువ సమయంలో తీసిన చిత్రం ‘యమదొంగ’.. దానికి కారణ చెర్రీ ప్లానింగే’’ అన్నారు. ‘‘మా పిల్లల్ని నేను ఎప్పుడూ తిడుతూ ప్రోత్సహిస్తుంటాను. కానీ, ఇప్పుడు చూస్తుంటే గర్వంగా ఉంది’’ అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ‘‘సంగీత దర్శకుణ్ణి కావాలనేనా కల ఈ సినిమాతో తీరింది’’ అన్నారు సంగీత దర్శకుడు కాలభైరవ. ‘‘ఈ సినిమా చూసిన వారు థ్రిల్ ఫీలవుతారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘అందరూ కొత్తవాళ్లు నిర్మించిన సినిమా ఇది’’ అన్నారు శ్రీసింహా. ‘‘కథపై నమ్మకంతో నిర్మాతలు రాజీ పడలేదు’’ అన్నారు రితేశ్. కెమెరామేన్ సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment