స్పూఫ్లోనే కాదు బాహుబలిలో కూడా..? | star comedian 30 years prudhvi in bahubali | Sakshi
Sakshi News home page

స్పూఫ్లోనే కాదు బాహుబలిలో కూడా..?

Published Thu, Jan 7 2016 1:02 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

స్పూఫ్లోనే కాదు బాహుబలిలో కూడా..?

స్పూఫ్లోనే కాదు బాహుబలిలో కూడా..?

ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కమెడియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు 30 ఇయర్స్ పృథ్వి. దాదాపు ప్రతి సినిమాలో లీడ్ కమెడియన్గా కనిపిస్తున్న పృథ్వి, వరుసగా సూపర్ హిట్ సినిమాల స్పూఫ్లతో అదరగొడుతున్నాడు. తాజాగా సౌఖ్యం సినిమాలో బాహుబలి స్పూఫ్లో కనిపించిన పృథ్వి, ఇప్పుడో గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. సూపర్ స్టార్లు కూడా చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు అని ఫీల్ అవుతున్న బాహుబలి 2లో నటించే అవకాశం సొంతం చేసుకున్నాడట.

ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో పృథ్వి పాల్గొంటున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తొలి భాగంలో పెద్దగా కామెడీ మీద దృష్టిపెట్టని రాజమౌళి, ఈ భాగంలో ఆ లోటు తీర్చాలని భావిస్తున్నాడు. అందుకే భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు కామెడీని కూడా పండించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇప్పటికే ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటుండగా అనుష్క, రానా ఫిబ్రవరి నుంచి షూటింగ్లో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement