మౌనం చెప్పిన కథ! | Story told of silence | Sakshi
Sakshi News home page

మౌనం చెప్పిన కథ!

Published Thu, Aug 27 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

మౌనం చెప్పిన కథ!

మౌనం చెప్పిన కథ!

నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో... హారర్ చిత్రాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ‘మౌనం’ పేరుతో ఓ సినిమా రానుంది. మురళీకృష్ణ, భాను ముఖ్య పాత్రల్లో సంధ్య మోషన్ పిక్చర్స్ సమర్పణలో కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి ప్రసాద్ నిర్మించనున్న చిత్రం ‘మౌనం’. ఈ చిత్రం బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి  ‘శ్రీమిత్ర’ చౌదరి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. దర్శకుడు ముప్పలనేని శివ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత లు మాట్లాడుతూ- ‘‘నేటి నుంచి ఈ సినిమా రె గ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.  అక్టో బర్ ఆఖరుకు సినిమా పూర్తిచేస్తాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, కథ: అనిల్ కె. నాని.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement