
సక్సెస్‌కు మంచి టీమ్ అవసరం
సినిమా విజయానికి మంచి కథతో పాటు ప్రతిభావంతులైన టీమ్ చాలా అవసరం అంటున్నారు నటి వేదిక. నటిగా ఈమె అభినయం ఏ పాటిదో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరదేశి, కావ్యతలైవన్ చిత్రాలే వేదిక నటనకు నిదర్శనం. అయితే ఆమె ఇంకా తనక ంటూ ఇక స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారన్నది నిజం. ప్రస్తుతం వినోదన్ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్న బహుభా నటి వేదికతో చిన్న భేటీ.
ప్ర: నటిగా మంచి స్థాయి కోసం ఇంకా పోరాడుతున్నట్లున్నారు. అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లున్నాయి. కారణం ఏమిటనుకుంటున్నారు?
జ: పరదేశి, కావ్యతలైవన్ చిత్రాల్లో నా పాత్రలు ఎంత బలమైనవో తెలిసిందే. ఆ తరువాత చాలా చిత్రాల అవకాశాలు వచ్చాయి. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించాలనుకోవడంలేదు. మంచి పాత్రలనే నేను ఆశిస్తున్నాను. అలాగని నేనేమి కాళీగా లేను. తమిళంతో పాటు కన్నడం,మలయాళం భాషల్లోనూ నటిస్తున్నాను. ఇక మంచి స్థాయి అంటారా’ ఎవరికైనా విజయంతోనే అంతస్తు పెరుగుతుంది. అలాంటి సక్సెస్ రావాలంటే కథతో పాటు మంచి టీమ్ చాలా అవసరం. అన్నీ కలిసొచ్చినప్పుడు స్థాయి అనేది వచ్చి తీరుతుంది.
ప్ర: తాజా చిత్రం వినోదన్‌లో కొత్త నటుడితో నటించడానికి సిద్ధం అవుతున్నట్లున్నారు?
జ: నూతన నటుడితో నటించడానికి అంగీకరించారేమిటన్న ప్రశ్నను చాలా మంది అడిగారు. వినోదన్ చిత్రం ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా నిర్మిస్తున్న తొలి చిత్రం. అయన ఎంత ప్రతిభావంతుడో చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రం అనగానే మరు మాట లేకుండా ఒప్పేసుకున్నాను. అలాగే వినోదన్ కథను దర్శకుడు వికటన్ జయరాజ్ చెప్పగానే బాగా నచ్చింది. ముఖ్యంగా నా పాత్ర చాలా ఆకట్టుకుంది. పరదేశి, కావయతలైవన్ చిత్రాల తరువాత అంత నటనకు అవకాశం ఉన్న పాత్ర. ఇలాటి పాత్రను ఇంతకు ముందు నా చిత్రాల్లో చూసి ఉండరు. ఈ చిత్ర టీమ్‌లో దర్శకుడు వికటన్ జయరాజ్, నవ కథానాయకుడు వరుణ్, సంగీత దర్శకుడు డి.ఇమాన్ ఇలా అందరూ ప్రతిభావంతులే .
ప్ర: ఇతర భాషల్లో నటిస్తున్న చిత్రాల గురించి?
జ: కన్నడంలో పి.వాసు దర్శకత్వంలో శివరాజ్‌కుమార్ సరసన నటిస్తున్నాను. ఇందులోనూ చాలా మంచి పాత్ర పోషిస్తున్నాను. ఇక మలయాళంలో పృథ్వీరాజ్‌కు జంటగా జేమ్స్ అండ్ అలీస్ అనే చిత్రం చేస్తున్నాను.