ఇక్కడ హీరో.. అక్కడ విలన్.. | sudheer babu doing vilain for bollywood young hero tiger shroff | Sakshi
Sakshi News home page

ఇక్కడ హీరో.. అక్కడ విలన్..

Published Wed, Oct 14 2015 1:24 PM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

ఇక్కడ హీరో.. అక్కడ విలన్..

ఇక్కడ హీరో.. అక్కడ విలన్..

'SMS' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు తరువాత 'ప్రేమ కథా చిత్రమ్' సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. సూపర్స్టార్ మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు, బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తెలుగులో 'భలే మంచి రోజు' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సుధీర్ ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బాలీవుడ్ మూవీ టీంతో జాయిన్ అవుతాడు.

జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న 'భాఘీ' సినిమాలో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడు సుధీర్ బాబు. హీరోకు పోటిగా ఉండే పవర్ ఫుల్ క్యారెక్టర్ కావటంతో నెగెటివ్ రోల్ అయినా సరే చేయడానికి అంగీకరించాడు సుధీర్. బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని మ్యాన్లీ ఫిజిక్ తో ఆకట్టుకునే సుధీర్ బాబు 'భాఘీ' సినిమాతో నార్త్ ఆడియన్స్కు కూడా దగ్గరవ్వాలని భావిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement