హీరో సుధీర్ బాబుకు గాయాలు | sudheer babu injured in baaghi shoot | Sakshi
Sakshi News home page

హీరో సుధీర్ బాబుకు గాయాలు

Published Wed, Dec 2 2015 2:49 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

హీరో సుధీర్ బాబుకు గాయాలు

హీరో సుధీర్ బాబుకు గాయాలు

టాలీవుడ్లో హీరోగా గుర్తింపు తెచ్చుకొని, ప్రస్తుతం బాలీవుడ్లో విలన్గా ఎంట్రీ ఇస్తున్న సుధీర్ బాబుకు 'బాగీ' సినిమా షూటింగ్లో గాయాలయ్యాయి. టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ రిహార్సల్స్ సమయంలో అతడికి ఈ గాయాలు అయ్యాయి. తన చేతిమీద అయిన గాయాన్ని చూపిస్తూ సుధీర్ బాబు ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేశాడు.

క్లైమాక్స్ షూట్ సందర్భంగా చేసిన మరో ట్వీట్లో టైగర్ ష్రాఫ్ను పొగడ్తలతో ముంచేశాడు సుధీర్. హాలీవుడ్లో కూడా ఇలాంటి యాక్షన్స్ సీన్స్ చూడలేదంటూ టైగర్ యాక్షన్ టాలెంట్ను ఆకాశానికి ఎత్తేశాడు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన తెలుగు సినిమా 'భలే మంచిరోజు' త్వరలో రిలీజ్కు రెడీ అవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement