మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్లో సుధీర్ | Sudheer Babu Next movie with trikoti | Sakshi
Sakshi News home page

మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్లో సుధీర్

Published Sat, Jun 3 2017 2:37 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్లో సుధీర్ - Sakshi

మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్లో సుధీర్

తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన యంగ్ హీరో సుధీర్ బాబు. వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు 2015లో రిలీజ్ అయిన భలే మంచి రోజు తరువాత సుధీర్ హీరోగా తెరకెక్కిన ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం వీర భోగవసంత రాయలు, శమంతకమణి లాంటి మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తున్న సుధీర్ బాబు, సోలో హీరోగా ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్కు సైన్ చేశాడు. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి త్రికోటి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు సుధీర్.

నాగశౌర్య హీరోగా తెరకెక్కిన దిక్కులు చూడకు రామయ్య సినిమాతో దర్శకుడిగా మారిన త్రికోటి.., తొలి ప్రయత్నంలో ఆకట్టుకోలేకపోయాడు. అందుకే లాంగ్ గ్యాప్ తరువాత సుధీర్ బాబు హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అమైరా దస్తర్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement