Sukumar Responds on Rangasthalam Movie Song Controversy
Sakshi News home page

‘రంగస్థలం’ వివాదంపై స్పందించిన సుకుమార్‌

Published Fri, Mar 16 2018 10:50 AM | Last Updated on Fri, Mar 16 2018 12:26 PM

Sukumar responds to Rangasthalam controversy - Sakshi

సాక్షి, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా రంగస్థలం. 1985 కాలం నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న విడుద‌ల కానుంది.  ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత నటించారు. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు అభిమానుల‌కు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులోని ‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ... పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు’ అంటూ సాగే పాటకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఆ చరణం యాదవ మహిళలను కించపరిచే విధంగా ఉందని, వెంటనే దాన్ని తొలగించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్‌ డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. పాటలోని ఆ చరణాన్ని వెంట‌నే తొలగించాలని, లేదంటే సినిమా విడుదలని అడ్డుకుంటామ‌ని ఆయ‌న డిమాండ్ చేసారు. 

దీనిపై రంగస్థలం దర్శకుడు సుకుమార్ స్పందించారు. గొల్లభామ అనే పదాన్ని మనుషులను ఉద్దేశించి వాడలేదని అదొక పురుగులాంటింద‌ని, ఇది అందరికీ తెలిసే ఉంటుందని సుకుమార్ ఓ ప్రెస్ మీట్‌లో తెలిపాడు. మ‌రి సుకుమార్ స‌మాధానంతో యాద‌వ్ హ‌క్కులు పోరాట స‌మితి సంతృప్తి చెందుతుందో చూడాలి. ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందిచగా, మానసి పాడారు. చరణ్‌ని ఏడిపిస్తూ సాగే ఈ పాటలో సమంత లుక్స్‌ కూడా ఈ పాటకు హైలెట్‌గా నిలిచాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement