ఆమె... ప్రేమ! | Sukumar Writings Banner in another movie 'her love' | Sakshi
Sakshi News home page

ఆమె... ప్రేమ!

Published Sun, Jun 5 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

ఆమె... ప్రేమ!

ఆమె... ప్రేమ!

అమ్మాయి వేసుకునే డ్రెస్సులను బట్టి వాళ్ల క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తామా..? కాస్త బోల్డ్‌గా మాట్లాడితే  క్యారెక్టర్ బ్యాడ్ అనేస్తామా...? ఆమెను ప్రేమించాలంటే పేరు చాలదా...? మొత్తం బయోగ్రఫీ కావాలా? ఇలాంటి ప్రశ్నలను రేకెత్తిస్తూ ‘కుమారి 21ఎఫ్’ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే అందించారు సుకుమార్. ఈ చిత్రం ద్వారా ఆయన నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘హర్ లవ్’అనే టైటిల్‌తో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారాయన. ‘ఈజ్ ప్యాషన్’ అనేది ఉపశీర్షిక.  

సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ సమర్పణలో హరిప్రసాద్ జక్కాను దర్శకుడిగా పరిచయం చేస్తూ  విజయ్‌కుమార్, థామస్ ఆధూరి, సత్తి నదీర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అశోక్, ఇషా, పూజిత ముఖ్యతారలుగా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేశ్ కోలా, లైన్ ప్రొడ్యూసర్: వీఈవికేడీఎస్ ప్రసాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement