
బుల్లితెరపై యాంకర్‌గా దూసుకెళుతోన్న సుమ తొలిసారి పెద్దతెరపై కనిపించిన చిత్రం ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ (1996). దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపించినా బుల్లితెర బిజీలో పెద్దతెరను పట్టించుకునే తీరిక సుమకు పెద్దగా దొరకడంలేదు. తాజాగా ‘పుష్ప’ సినిమాకి దర్శకుడు సుకుమార్ అడిగితే ‘యస్’ చెప్పేశారు. అల్లు అర్జున్ (బన్నీ) హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఇందులో బన్నీకి అక్కగా కనిపించనున్నారట సుమ. సుకుమార్ తన గత చిత్రం ‘రంగస్థలం’లో యాంకర్ అనసూయతో రంగమ్మత్త పాత్ర చేయించారు. ఆ పాత్ర ఓ హైలైట్‌గా నిలిచింది. మరి.. సుమ పాత్రను ఎలా డిజైన్ చేశారో తెరపై చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment