సమ్మర్ స్పెషల్ సమంతా | Summer Special Samantha | Sakshi
Sakshi News home page

సమ్మర్ స్పెషల్ సమంతా

Feb 18 2016 2:52 AM | Updated on Aug 9 2018 7:30 PM

సమ్మర్ స్పెషల్ సమంతా - Sakshi

సమ్మర్ స్పెషల్ సమంతా

సమ్మర్(వేసవికాలం)కు సినిమాకు ఒక అవినాభావ సంబంధం ఉంటుందని చెప్పవచ్చు.

సమ్మర్(వేసవికాలం)కు సినిమాకు ఒక అవినాభావ సంబంధం ఉంటుందని చెప్పవచ్చు. పరీక్షలు రాసిన విద్యార్థులకు సెలవులు, వేసవి తాపానించి కాస్త స్వేద తీరాలని కోరుకునే సగటు ప్రేక్షకుడికి తొలి ఆప్షన్ సినిమానే.అందుకే సమ్మర్‌లో పలు చిత్రాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తుంటారు. అలాంటి వారిని నటి సమంత చిత్రాలు అలరించనున్నాయి. అలా ఈ సమ్మర్ సమంత స్పెషల్ కానుంది.దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్లలో సమంత ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోలతో నటిస్తున్న లక్కీ హీరోయిన్ సమంత.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. వాటిలో సూర్యకు జంటగా నటించిన 24,విజయ్ సరసన చేసిన తెరి, టాలీవుడ్ నటుడు మహేశ్‌బాబు జంటగా నటిస్తున్న ద్విభాషా చిత్రం బ్రహ్మోత్సవం చిత్రంలో పాటు నితిన్‌తో రొమాన్స్ చేస్తున్న అఆ చిత్రాలు సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్, మే నెలల్లో వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక పోతే ఈ ఏడాది ధనుష్‌తో వడచెన్నై, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన జనతా గ్యారేజ్, కృష్ణవంశీ దర్శకత్వంలో రుద్రాక్ష వంటి భారీ చిత్రాలలో నటించనున్నారు. ఈ ఏడాదినే సమంత ఏడాది అనవచ్చునేమో.పైన పేర్కొన్న చిత్రాలన్నీ మంచి అంచనాలు ఏర్పరచుకున్న చిత్రాలే అన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement