ఇది యూనివర్శల్ మూవీ | Sunil in Malayalam Movie Two Countries Telugu Remake | Sakshi
Sakshi News home page

ఇది యూనివర్శల్ మూవీ

Published Fri, Aug 26 2016 11:40 PM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM

ఇది యూనివర్శల్ మూవీ - Sakshi

ఇది యూనివర్శల్ మూవీ

- దర్శకుడు శంకర్
 మలయాళంలో ఘన విజయం సాధించిన ‘టూ కంట్రీస్’ చిత్రాన్ని తెలుగులో సునీల్ హీరోగా ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రికార్డింగ్ ప్రారంభించగా, టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ స్క్రిప్ట్ అందించారు. ఎన్. శంకర్ మాట్లాడుతూ-‘‘‘టూ కంట్రీస్’ చిత్రం నాకు నచ్చింది.
 
 అందులో దిలీప్‌గారు చేసిన పాత్రను సునీల్ తప్ప ఎవరూ చేయలేరనిపించింది. అందుకే తనను కూడా సినిమా చూడమన్నాను. సునీల్‌కు కూడా బాగా నచ్చడంతో ఈ చిత్రం మొదలైంది. గతంలో నేను తీసిన చిత్రాలన్నీ కాన్సెప్ట్ బేస్డ్. కానీ, ఇది మాత్రం యూనివర్శల్ మూవీ. మలయాళ మాతృతకు సంగీతం అందించిన గోపీసుందర్ మా చిత్రానికి స్వరాలు అందించనున్నారు. పదిహేను రోజులు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత డెబ్బై శాతం చిత్రీకరణ అమెరికాలో ఉంటుం ది’’ అని తెలిపారు.
 
 సునీల్ మాట్లాడుతూ-‘‘దిలీప్‌గారు చేసిన ఓ చిత్రాన్ని ‘పూలరంగడు’గా రీమేక్ చేసి హిట్ అందుకున్నాం. మరోసారి ఆయన మూవీ రీమేక్‌లో నటిస్తుండటం సంతోషంగా ఉంది. రెడీమేడ్ షర్ట్‌లా ఈ చిత్రానికి అన్నీ పక్కాగా సమకూరాయి. నా ‘పూలరంగడు’, ‘భీమవరం బుల్లోడు’ చిత్రాలకు డైలాగ్స్ అందించిన శ్రీధర్ సీపాన మళ్లీ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement