జర్నలిస్టును చెంప మీద కొట్టిన సన్నీలియోన్ | Sunny Leone slaps journalist in gujarat | Sakshi
Sakshi News home page

జర్నలిస్టును చెంప మీద కొట్టిన సన్నీలియోన్

Published Fri, Mar 25 2016 12:39 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

జర్నలిస్టును చెంప మీద కొట్టిన సన్నీలియోన్ - Sakshi

జర్నలిస్టును చెంప మీద కొట్టిన సన్నీలియోన్

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ కార్యక్రమం కోసం వెళ్లిన సన్నీలియోన్.. అక్కడ ఓ జర్నలిస్టును లాగి లెంపకాయ కొట్టిందట. ఇప్పుడు హీరోయిన్ అయిపోయారు కదా, మరి రాత్రి కార్యక్రమాలకు ఎంత తీసుకుంటున్నారని అడగడంతో పట్టలేని కోపం వచ్చిన సన్నీ.. వెంటనే అతగాడి చెంపమీద తన చేతివేళ్ల ముద్రలు వేసిందట. సూరత్ నగరంలో హోలీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. 'సన్నీలియోన్‌తో హోలీ' అనే ఈ కార్యక్రమం కాస్తా రసాభాసగా ముగిసింది. జాతీయ వార్తాచానల్‌కు చెందిన రిపోర్టర్ ఆమెను ఈ ప్రశ్న వేయడంతో ఆమెకు విపరీతంగా కోపం వచ్చింది. హోటల్ కారిడార్‌లో ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది.

ఆ తర్వత.. కార్యక్రమంలో జర్నలిస్టులు ఎవరూ లేకపోతేనే తాను ప్రదర్శన ఇస్తానని నిర్వాహకులకు సన్నీ స్పష్టం చేసింది. ఆ తర్వాత స్టేజి మీద పావుగంట పాటు డాన్సులు వేసి అక్కడున్నవారిని అలరించింది. గురువారం ఉదయం సన్నీలియోన్‌తో పాటు ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా సూరత్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు వచ్చారు. ఓ వ్యక్తి తాగేసి వాళ్ల గదిలోకి వచ్చి, సన్నీలియోన్‌తో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతడిని బయటకు పంపేసిన తర్వాత హోటల్ కారిడార్‌లో జర్నలిస్టు ఆమె ఇంటర్వ్యూ తీసుకోవడం మొదలుపెట్టారు. కాసేపటికి ఈ ప్రశ్న రావడంతో ఆమెకు కోపం వచ్చి ఒక్కటి ఇచ్చుకుంది. అతడికి సన్నీ సరైన సమాధానమే ఇచ్చిందని, అందుకే పోలీసు కేసు పెట్టడం లేదని ఆమె భర్త చెప్పారు. పైగా కార్యక్రమ నిర్వాహకులు కూడా కాలేజీకి వెళ్లే పిల్లలని, వాళ్ల కెరీర్ పాడవ్వడం ఇష్టం లేకనే ఊరుకుంటున్నామని అన్నారు. అయితే.. ఇకమీదట గుజరాత్ రావలంటే మాత్రం సన్నీలియోన్ వెయ్యిసార్లు ఆలోచిస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement