సూపర్‌ స్టార్‌తో విఘ్నేశ్‌ | Super Star Rajinikanth Movie With Vignesh Sivan | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్టార్‌తో విఘ్నేశ్‌

Published Sun, Apr 14 2019 11:03 AM | Last Updated on Sun, Apr 14 2019 11:03 AM

Super Star Rajinikanth Movie With Vignesh Sivan - Sakshi

నటుడు రజనీకాంత్‌ను నటి నయనతార ప్రియుడు, దర్శకుడు అయిన విఘ్నేశ్‌ శివన్‌ కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇదే ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రంలో నయనతార కథానాయకిగా నటిస్తోంది. అలా ఆమెతో వెళ్లిన విఘ్నేశ్‌ శివన్‌ రజనీకాంత్‌తో ఫొటో దిగారా? లేక మరేదైనా పర్పస్‌ ఉందా? అన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది.

ప్రస్తుతం శివకాకేయన్‌ హీరోగా చిత్రం చేయబోతున్న విఘ్నేశ్‌ శివన్‌కు రజనీకాంత్‌ అవకాశం ఇవ్వనున్నారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. రజనీకాంత్‌కు తిల్లు ముల్లు వంటి పూర్తి హస్యభరిత కథా చిత్రంలో నటించాలనే కోరిక చాలా కాలంగా ఉందని, అలాంటి కథలో విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. దర్బార్‌ చిత్ర షూటింగ్‌కు బయలు దేరే ముందు రజనీకాంత్‌ను మరో దర్శకుడు కేఎస్‌.రవికుమార్‌ కలిశారు.

వీరి కలయిక చర్చనీయాంశంగా మారింది. దర్బార్‌ చిత్రం తరువాత రజనీకాంత్‌ కేఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్, కేఎస్‌.రవికుమార్‌ కాంబినేషన్‌లో ఇంతకు ముందు పడయప్పా, ముత్తు వంటి విజయవంతమైయిన చిత్రాలు వచ్చాయన్నది గమనార్హం.

దీంతో దర్బార్‌ తరువాత రజనీకాంత్‌ కేఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తారా, లేక యువ దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌కు అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. రజనీకాంత్‌ ఇటీవల యువ దర్శకులతో చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement