'మేము' రిలీజ్ పై డైలమా | suriya memu release postponed | Sakshi
Sakshi News home page

'మేము' రిలీజ్ పై డైలమా

Published Sat, Dec 26 2015 1:00 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

'మేము' రిలీజ్ పై డైలమా

'మేము' రిలీజ్ పై డైలమా

కోలీవుడ్లో స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న సూర్య నిర్మాతగాను మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే జ్యోతిక లీడ్ రోల్లో 36 వయోధినిలే సినిమాను తెరకెక్కించిన సూర్య, మరో సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జాతీయ అవార్డు గెలిచిన దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పసంగ 2 సినిమాను 'మేము' పేరుతో తెలుగు లోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.

చాలా కాలం క్రితమే అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, రిలీజ్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు సూర్య. డిసెంబర్ తొలి వారంలోనే రిలీజ్ ప్లాన్ చేసినా ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవటంతో వాయిదా పడింది. ఆ తరువాత క్రిస్టమస్ బరిలో నిలపాలని భావించినా, తెలుగులో మూడు సినిమాల రిలీజ్ ఉండటంతో వాయిదా వేశారు.  జనవరిలో కూడా వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇక చేసేదేమి లేక జనవరి నెలాఖరున మేము సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాలో, తనూ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు సూర్య ఈ సినిమాలో కనిపించనున్నాడు. అమలాపాల్, బిందు మాధవి ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ సినిమా కథ మానసిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల చుట్టూ తిరుగుతోంది. తమిళంలో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement