సూర్య కొత్త సినిమా 'మేము' | Suriya Tamil film pasanga 2 releasing in telugu as memu | Sakshi
Sakshi News home page

సూర్య కొత్త సినిమా 'మేము'

Published Sat, Oct 17 2015 9:36 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

సూర్య కొత్త సినిమా 'మేము'

సూర్య కొత్త సినిమా 'మేము'

కోలీవుడ్ స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలతో పాటు సోషల్ మెసేజ్ ఉన్న సినిమాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. హీరోలుగానే కాదు నిర్మాతలుగా కూడా అలాంటి సినిమాలతో తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ధనుష్ 'కాకముటై' సినిమాతో బస్తీల్లో పిల్లల జీవనాన్ని పరిచయం చేయగా, సూర్య కూడా అదే బాటలో నడుస్తున్నాడు.

సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై 'పసంగ 2' అనే బాలల చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు వర్షన్కు 'మేము' అనే టైటిల్ను ఫైనల్ చేశారు. సూర్య, అమలా పాల్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్న ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

పాండిరాజ్ దర్శకత్వంలోనే బాలల చిత్రాలుగా తెరకెక్కిన 'పసంగ', 'మెరినా' సినిమాలు మంచి విజయాలు సాధించటంతో అదే జానర్ లో మరోసారి 'పసంగ 2'ను తెరకెక్కించారు. తొలుత తమిళ్ లోనే రిలీజ్ చేయాలని భావించినా, సూర్య గెస్ట్ అపియరెన్స్ ఇస్తుండటంతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుందని భావించి 'మేము' పేరుతో తెలుగులో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement