
నటుడిగా, నిర్మాతగా వరుస విజయాలతో దూసుకెళుతున్న నటుడు సూర్య ‘అగరం ఫౌండేషన్’ ద్వారా పలువురు పేద విద్యార్థులకు విద్యా దానం చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సోదరుడు కార్తీ హీరోగా సూర్య నిర్మించిన ‘కడైకుట్టి సింగం’ ఇటీవల విడుదలైంది. ‘చినబాబు’ పేరుతో ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. ‘కడైకుట్టి సింగం’ సక్సెస్ మీట్‌ను మంగళవారం చెన్నైలో నిర్వహించారు.
ఇది వ్యవసాయం, కుటుంబ అనుబంధాల ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం కావడంతో సూర్య ఈ వేడుకలో రైతులకు కోటి రూపాయలు సాయంగా అందించారు. మన కంటే కూడా చెమటోడ్చుతున్న వారు రైతులేనని అందుకే ఈ సాయాన్ని అందిస్తున్నానని సూర్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమిళనాడులో ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఈ నగదు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment