
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనపై దర్శక, నిర్మాత కరణ్‌జోహార్ స్పందించారు. ఈ మధ్య కాలంలో సుశాంత్‌తో టచ్‌లో లేకపోవడం పట్ల తనను తాను నిందించుకున్నారు. ఈమేరకు ఆయన ఇన్‌స్టా పోస్టులో.. ‘ఏడాది కాలంగా నీకు దూరంగా ఉన్నందుకు నాకు నేనే నిందించుకుంటున్నా. నీ జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకునేందుకు ఓ స్నేహితుడు అవసరమై ఉండొచ్చునని కొన్నిసార్లు గ్రహించాను. కానీ, ఆ విధంగా నేను మరింతగా ఆలోచించలేకపోయా. ఇలాంటి తప్పు జీవితంలో ఇంకెప్పుడూ చేయను’అని పేర్కొన్నారు.
(చదవండి: సుశాంత్ ఆత్మహత్య : విలపించిన సోదరి)
ఇక మనుషులు సంబంధాలను మరింతగా పెంపొందించుకోవాలని కూడా కరణ్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా 'సుశాంత్ మరణం నాకు పెద్ద మేల్కొలుపు. నీ కల్మషం లేని నవ్వులను, నీ ఆత్మీయ కౌగిలింతల్ని చాలా మిస్ అవుతున్నాం' అని ఇన్‌స్టా పోస్టులో కరణ్ సంతాపాన్ని తెలియజేశారు. కరణ్ నిర్మించిన నెట్‌ఫ్లిక్స్ మూవీ ‘డ్రైవ్’లో సుశాంత్ నటించాడు. ఇక పవిత్ర రిస్తా సీరియల్‌తో పెద్ద సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకొన్న సుశాంత్ శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోనీ, చిచోర్, కేదార్‌నాథ్, సోంచిరియా సినిమాల్లో నటించి అగ్రశ్రేణి కథానాయకుడిగా పేరు తెచ్చుకొన్నారు. కాగా, ముంబైలోని తన ఇంట్లో సుశాంత్ ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
(చదవండి: సుశాంత్ ఆత్మహత్య : దర్యాప్తు ముమ్మరం)
Comments
Please login to add a commentAdd a comment