హైదరాబాద్: బాలీవుడ్ యువ హీరో, ‘ఎంఎస్ ధోని’ బయోపిక్ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణవార్త యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. సుశాంత్ హఠాన్మరణాన్ని అటు సినీ ప్రముఖులు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో సుశాంత్ చాలా ఆక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతను ఇన్‌స్టాలో చేసిన చివరి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన తల్లి గురించి కవితాత్మకంగా పెట్టిన పోస్ట్ నెటిజన్లను కంటతడిపెట్టిస్తోంది.
‘మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా' అంటూ జూన్3న ఇన్‌స్టాలో సుశాంత్ భావోద్వేగమైన పోస్ట్ చేశారు. పలు టీవీ సీరియళ్లలో నటించిన సుశాంత్ సింగ్, 1986 జనవరి 21న పట్నాలో జన్మించారు. 2013లో వచ్చిన ‘కై పో చే’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఎంఎస్ ధోని’ బయోపిక్‌తో ఫుల్ క్రేజ్ సాధించారు.
చదవండి:
సుశాంత్ ఆత్మహత్యకు అదే కారణమా?
సుశాంత్ మరణం: షాక్‌లో సినీ ఇండస్ట్రీ
Comments
Please login to add a commentAdd a comment