Sushant rajput
-
కొడుకు కోసమే కక్షసాధింపు
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, అధికార శివసేన పార్టీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఈసారి మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకును విమర్శించారు. మూవీ మాఫియా, సుశాంత్ రాజ్‌పుత్ హంతకులు, వారికి చెందిన డ్రగ్ రాకెట్ ముఠాల గుట్టును తాను బయటపెట్టడం మహారాష్ట్ర సీఎంకు సమస్యగా మారిందని, ఎందుకంటే ఈ మూడింటితో ఆయన కుమారుడు ఆదిత్య చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారని కంగన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాలను బయటపెట్టడమే తాను చేసిన అతిపెద్దనేరమని, అందుకే తనపై కక్షగట్టినట్లు శివసేన ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన ట్వీట్‌కు సంబంధించి వచ్చిన పత్రికా కథనంపై స్పందిస్తూ కంగన ఈ ఆరోపణలు చేశారు. వీరి గుట్టు బయటపెట్టినందుకే తనపై కత్తికట్టారని చెబుతూ ‘‘చూద్దాం! ఎవరి ఆట ఎవరు కట్టిస్తారో?’’ అని ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. ఒక మహిళను అవమానించి, భయపెట్టి వారి ఇమేజీని వారే పాడుచేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జూన్‌లో నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత నుంచి ఆమె బాలీవుడ్‌ను తీవ్రంగా విమర్శిస్తూవస్తోంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, బయట నుంచి వచ్చిన వాళ్ల ఎదుగుదల చూసి ఓర్వలేని సినీ పరిశ్రమ చేసిన ప్రణాళికాయుత హత్యని ఆమె ఆరోపించారు. (చదవండి: కంగనపై శివసేన ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు!) ముంబై వీడిన క్వీన్ సోమవారం కంగన ముంబైని వీడి స్వరాష్ట్రం హిమాచల్‌కు చేరుకున్నారు.‘నిరంతర దాడులు, తన ఆఫీస్ కూల్చివేత, చుట్టూ బాడీగార్డుల రక్షణ పెట్టుకోవాల్సిరావడం చూస్తే నేను ముంబైని పీఓకేతో పోల్చడం కరెక్టేననిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. కుక్కతోక వంకర! ముంబైని పీఓకేతో తాను పోల్చడం కరెక్టేనంటూ కంగన చేసిన తాజా వ్యాఖ్యలపై శివసేన ఎంఎల్ఏ ప్రతాప్ సర్నాయక్ మండిపడ్డారు. ఎంత యత్నించినా కుక్కతోక వంకరేనన్న మాటలకర్ధం తెలిసిందని పరోక్షంగా కంగనపై విమర్శలు చేశారు. ముంబై మరీ అంత చెడ్డనగరమనిపిస్తే, పీఓకేలాగా కనిపిస్తే కంగన నగరం వదిలి తనకు సరైన చోటుకు పోవచ్చని శివసేన మంత్రి అనీల్ సూచించారు. ముంబై గురించి చెడుగా మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. -
బాయ్‌కాట్ కంగనా!
‘‘వారసులను మాత్రమే సల్మాన్ ఖాన్ ప్రోత్సహిస్తాడు. తనకు ఎదురు తిరిగినవాళ్లను హింసిస్తాడు. బాయ్‌కాట్ సల్మాన్ ఖాన్’’ అంటూ ఆ మధ్య బాలీవుడ్లో పెద్ద దుమారం మొదలైంది. ఇప్పుడు ‘బాయ్‌కాట్ కంగనా రనౌత్’ అనే వివాదం ఆరంభమైంది. ‘బాయ్‌కాట్ కంగనా’ అనే పోస్ట్‌ని లక్షమందికి పైగా సమర్థించారు. గంటకు దాదాపు 13 వేలకు పైగా సోషల్ మీడియా ఫాలోయర్స్ ఆమెకు వ్యతిరేకంగా పోస్టులను పెట్టారు. డేటా ఇంటిలిజెన్స్ యూనిట్ ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు ఉన్న డేటాను తీసుకుని (డి.ఐ.యూ) కంగనాకి వ్యతిరేకంగా వచ్చిన పోస్టులను లెక్కకట్టింది. అసలు కంగనాను ఎందుకు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు? అంటే దానికి కారణం లేకపోలేదు. నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యా లేక హత్యా అనే విషయం తేలకముందే బాలీవుడ్ మాఫియానే అతన్ని చంపేసిందని, బాలీవుడ్‌లోని నెపోటిజమే (బంధుప్రీతి) బలి తీసుకుందని ఆరోపణలు చేశారు కంగనా. ఈ ఆరోపణలు నిజమే అని నమ్మిన. కొందరు ఫాలోయర్లు కంగనా వ్యతిరేకించినవారిని (స్టార్స్‌ని) సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు ‘బాయ్‌కాట్ కంగనా’ అనేది వైరల్ అయింది. ‘‘ఇదంతా బాలీవుడ్ మాఫియా చేస్తున్న పనే. స్టార్ కిడ్స్‌ని ప్రోత్సహించడానికి, నా కెరీర్‌ని నాశనం చేయడానికి ఇలా చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో బాయ్‌కాట్ కంగనా అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు’’ అన్నారు కంగనా. అది మాత్రమే కాదు.. త్వరలోనే కొందరి వ్యవహారాలను బయటపెడతా అని కూడా పేర్కొన్నారు. -
సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ
పట్నా/ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును ఎవరు చేపట్టాలనే దానిపై పట్నా, ముంబై పోలీసుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ ట్విట్టర్లో ఈ మేరకు ప్రకటించారు. ‘సుశాంత్ తండ్రి కేకే సింగ్ కూడా సీబీఐ దరాప్తునకు సమ్మతం తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీజీపీని కోరాను. ఈ రోజే ఈ కేసును సీబీఐ విచారణకు పంపుతాం’అని పేర్కొన్నారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం ఐపీఎస్ అధికారిని ముంబైకి పంపించాం. అక్కడి పోలీసులు ఆయనను బలవంతంగా క్వారంటైన్‌కు పంపించారు. సీబీఐ అయితేనే ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయగలదు’అని ఆయన వివరించారు. దీనిపై సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి తరఫు లాయర్ సతీశ్‌మానే షిండే స్పందించారు. ఎలాంటి సంబంధం లేకుండానే బిహార్ పోలీసులు ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తామనడం చట్టపరంగా చెల్లుబాటు కాదు. బిహార్ పోలీసులు నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్ను ముంబై పోలీసులకు మాత్రమే పంపగలరు’ అని తెలిపారు. -
సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
పట్నా : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు బృందం ( సీబీఐ)కి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం సిఫారసు చేసింది. సుశాంత్ ఆత్మహత్య కేసులో బీహార్, మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, దర్యాప్తులో భాగంగా గత ఆదివారం రాత్రి ముంబైకి వెళ్లిన బీహార్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సోమవారం బీహార్ అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ ఈ కేసులో సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేశారు. (చదవండి : సూసైడ్ ముందు సుశాంత్ ఏం సెర్చ్ చేశాడంటే..) అలాగే సుశాంత్ తండ్రి కేకే సింగ్ కూడా తమ కుమారుడి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కోరారు. కుటుంబసభ్యులు కోరిన నేపథ్యంలో సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచారణకు సిఫారసు ప్రతిపాదన చేస్తున్నట్లు ఓ మీడియాతో సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. కాగా, ముంబైలోని బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ జూన్ 14వ తేదీన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేయడం చర్చనీయాంశంగా మారింది. (చదవండి : రక్షాబంధన్ : సుశాంత్ సోదరి భావోద్వేగం) -
ఔట్ సైడర్స్
దీపికా పడుకోన్ కర్నాటక. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్. ప్రియాంకా చోప్రా బిహార్. విద్యాబాలన్ మహారాష్ట్ర చెంబూర్. తాప్సీ పన్ను న్యూఢిల్లీ. అనుష్కా శర్మ ఉత్తర ప్రదేశ్. ‘ఔట్‌సైడర్స్’.. వీళ్లంతా! బయటి నుంచి వచ్చినవాళ్లు అని కాదు. బాలీవుడ్ రానివ్వని వాళ్లు. రానివ్వలేదని.. వెళ్లిపోలేదు! సపోర్టు లేకున్నా నిలబడ్డారు. సపోర్టుగానూ ఉంటున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ చనిపోయి నేటికి రెండు వారాలు! అతడి మరణంతో పైకి లేచిన ‘బంధుప్రీతి’ ఆరోపణల భూతం ముంబైలో సినిమాలు తీస్తుండే పెద్ద కుటుంబాల ఇళ్ల తలుపులను దబదబమని కొడుతూ, కాలింగ్ బెల్ నొక్కుతూ లోపల ఉన్నవారందరికీ నిద్ర లేకుండా చేస్తోంది. బయటికి వచ్చి చూస్తే మళ్లీ కనిపించదు! ట్వీట్లుగా, పోస్ట్‌లుగా సోషల్ మీడియా స్నానం చేయించి, ఒళ్లు తుడిచి, తల దువ్వి, పౌడర్ అద్ది వదులుతున్న భూతం అది. ప్రధానంగా కరణ్ జొహార్, సల్మాన్ ఖాన్ల రక్తం కావాలి దానికిప్పుడు. ఆ రక్తం.. తాగేందుకు కాదు. సుశాంత్ ఆత్మను అభిషేకించేందుకు! వీళ్లిద్దరు, మరికొందరు.. కొత్తవాళ్లను సినిమాల్లోకి రానివ్వకుండా, వచ్చినా నిలవనివ్వకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే పుట్టి పెరిగిన ఆలియా భట్, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా లకు, బంధువుల ఇళ్లలోని డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లు, టెక్నీషియన్లకు మాత్రమే అవకాశాలు ఇస్తూ, బయటి టాలెంట్‌ను తొక్కి పడేస్తున్నారని.. ఆ భూతం పోలిస్ కంప్లయింట్లు, ఆన్లైన్ పిటిషన్ల వరకూ వెళ్లింది. భూతాల ఆటలు రామ్‌గోపాల్ వర్మ లాంటి వాళ్ల దగ్గర సాగవు. అతడే ఒక భూతంలా ఉంటాడు. పైగా రకరకాల భూతాల మీద సినిమాలు తీసినవాడు. ఆరోపణల భూతం అతడికి ఒక లెక్కా! ‘‘ఏయ్.. భూతమా! నోరు మూసుకుని వెళ్లు. ఎవరి పిల్లల్ని వాళ్లు పైకి తేకుండా, పక్కింటి వాళ్ల పిల్లల్ని హీరోలను, హీరోయిన్లను చేసేస్తారా ఎక్కడైనా..’’ అన్నాడు. ఆలియా భట్ తల్లి సోనీ రాజ్దాన్ కూడా... ‘‘నీ పిల్లలు పెద్దవాళ్లు అవకపోతారా! అప్పుడు నువ్వు వాళ్లను కాదని బయటి వాళ్ల పిల్లలకు చాన్సులిస్తావా? అదీ చూస్తాను’’ అని భూతంతో అన్నారు. ‘మన’ అనేది మన బ్లడ్‌లోనే ఉంటుంది. బయట ఎంత టాలెంట్ ఉన్నా.. ‘టాలెంట్ ఎవరికి దగ్గర లేదూ..’ అని ఇంట్లోంచి పిల్లల్ని తెచ్చి పెర్ఫార్మ్ చేయించడాన్ని తప్పయితే పట్టేందుకు లేదు. డబ్బున్న వాళ్లు, పలుకుపడి ఉన్నవాళ్లు పరోపకారం చేయడానికి, పదిమందిని పైకి తేవడానికి ఆ డబ్బును, పలుకుబడిని ఉపయోగించినా.. మొదటి ప్రాధాన్యం రక్తసంబంధాలకే ఉంటుంది. ఏ ఫీల్డులోనైనా పైకి రావడానికి ఎవరి కష్టం వారు పడాల్సిందే. సుశాంత్‌ని ‘అయ్యో’ అని, అతడికి మోకాళ్లు అడ్డుపెట్టి ఉంటారని అనుకున్నవాళ్లను ‘ఏమయ్యో’ అని.. భూతం అంటోంది కానీ.. కెరీర్ ఆరంభంలో షారుక్ ఖాన్ కూడా ఒక సుశాంతే. మాధురీ దీక్షిత్ కూడా ఔట్సైడరే! నెగ్గుకు రాలేదా మరి?! ఎవరెస్టంత ఎత్తులో ఉండి, అణిగిమణిగి ఉన్నప్పటికీ బాలీవుడ్ తల్లి కరుణిస్తుందని చెప్పలేం. కరుణించాలని డిమాండింగ్‌గా మారామూ చేయలేం. అయితే ఎవరి కరుణా కటాక్షాలతోనూ నిమిత్తం లేకుండా తమని తాము నిరూపించుకుని, నిలదొక్కుకున్న బయటి నటీమణులు బాలీవుడ్లో తక్కువ సంఖ్యలో ఏమీ లేరు. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్ అనుష్కా శర్మ, విద్యాబాలన్, తాప్సీ.. మరీ ముఖ్యంగా కంగనా రౌనత్ వంటి వారున్నారు. వీళ్లను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉన్నా సుశాంత్ ధైర్యంగా నిలబడగలిగి ఉండేవాడు. త్వరలో రిలీజ్ కాబోతున్న ‘దిల్ బేచారా’ అతడి చివరి చిత్రం అయి ఉండేది కాదు. ఐశ్వర్య, ప్రియాంక అందాల రాణులు. దీపిక, అనుష్క మోడలింగ్ నుంచి వచ్చారు. విద్యాబాలన్ మ్యూజిక్ ఆల్బమ్‌తో పరిచయం అయ్యారు. తాప్పీ, కంగనా రనౌత్ నేరుగా సినిమాల్లోకే ఎంట్రీ ఇచ్చారు. అందరిలోనూ కామన్ పాయింట్ ఒకటే. వీళ్లెవ్వరికీ బాలీవుడ్ బ్యాగ్రౌండ్ లేదు. వీళ్లకు ఒక్క ‘ఇన్సైడర్’ కూడా హెల్ప్ చెయ్యలేదు. అలాగని అడ్డు పడకుండానూ లేరు. అయినా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ప్రియాంక అయితే హాలీవుడ్ వరకు ఎదిగారు. బాలీవుడ్లో ఆమెకు చేదు అనుభవాలు లేవని కాదు. ‘ఐ హ్యావ్ కిక్డ్ అవుటాఫ్ íఫిల్మ్’ అని అనేక ఇంటర్వూ్యల్లో చెప్పారు కూడా. అంతా ఓకే అయ్యాక ఆఖరి నిముషంలో వేరే వాళ్లను తీసుకునేవారట. ఇప్పుడు ప్రియాంకకే ‘పర్పుల్ పెబిల్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థ ఉంది. యంగ్ టాలెంట్‌కి అవకాశాలు ఇస్తున్నారు. ‘ఓం శాంతి ఓం’(2007) తో బాలీవుడ్‌లోకి వచ్చిన దీపిక కూడా ఒక దశలో తన కో–స్టార్ కన్నా తనే ఎక్కువ పారితోషికం తీసుకునే స్థాయికి (పద్మావతి) చేరుకున్నారు. హీరోయిన్లు తమ మానసిక అనారోగ్యం గురించి బయట పడితే చాన్సులు తగ్గుతాయి. అందుకు జంకలేదు దీపిక. సినిమాల్లోకి రాకముందు తను డిప్రెషన్లోకి వెళ్లిన విషయాన్ని బయటపెట్టారు. రామ్ లీల, తమాషా, బాజీరావ్ మస్తానీ, పికుతో విలక్షణ ప్రతిభ కనబరిచారు. అనుష్క కూడా దీపికలానే. ‘రబ్ నె బనా ది జోడి (2008) తో స్క్రీన్ మీదకు వచ్చారు. బ్యాండ్ బాజా బారాత్, ఎన్‌హెచ్10, సుల్తాన్, ఏ దిల్ హై ముష్కిల్, సూయీ ధాగా.. అన్నీ ఆమె చెంతకు వచ్చిన సినిమాలే. ఇప్పుడిక ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్’ ప్రొడక్షన్ కంపెనీ పెట్టి వెబ్ సిరీస్‌తో యువ నటీనటులకు అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవలి ‘పాతాళ్ లోక్’ సీరీస్, తాజాగా ‘బుల్బుల్’ సినిమాలకు ఆనుష్కే నిర్మాత. తాప్సీ పన్ను నటించిన సినిమాలైతే ఆమె కోసమే రాసినట్లు ఉంటాయి. అంటే ‘నెపోటిజమ్’ భర్తీ చేయలేనట్లు! తెలుగు, తమిళం, మలయాళం, హిందీ... అన్ని భాషల్లో ఆమెకు అవకాశాలు ఉన్నాయి. పింక్ , బద్లా, మన్మర్జియాన్, సాంద్కి ఆంఖ్, తప్పడ్.. ప్రేక్షకుల్ని, విమర్శకుల్నీ మెప్పించాయి. ఇంతగా నటిస్తూ, ఆరు జాతీయ అవార్డులు గెలుచుకున్న తాప్సీ కూడా బాలీవుడ్లో బాగా ‘స్ట్రగుల్’ అయిన వారే. ‘‘నేను బయటి నుంచి వచ్చాను కాబట్టి పెద్ద పెద్ద గ్లామరస్ పాత్రలేమీ నాకు రాలేదు. వచ్చిన వాటినే బాగా చేయడానికి మించి నేనేమీ ఆశించలేదు. వచ్చినవే చేస్తూ వస్తున్నాను’’ అని ఒక ఇంటర్వూ్యలో కొద్దిగా బయటపడ్డారు తాప్సీ. రాధికా ఆప్టే మరో తాప్సీ. మంచివి వస్తే చేయడం. రానప్పుడు బయటి వ్యక్తిగా ఉండిపోవడం. ఇక విద్యాబాలన్ గెలుచుకున్న ఉత్తమ నటి అవార్డు, ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పూర్తిగా ఆమె తన నటనతో సాధించుకున్నవే. ‘పరిణీత’తో ఆమె సినిమాల్లోకి వచ్చారు. పా, ఇష్కియా, కహానీ, ది డర్టీ పిక్చర్.. ఆమెకు ఇండస్ట్రీలో మంచి స్థానం కల్పించాయి. వీళ్లు కాక.. వెబ్ సీరీస్‌తో ఇప్పుడు రసికా దుగల్, శోభితా ధూళిపాళ, కీర్తీ కుల్కర్ణి, మాన్వీ గగ్రూ తరచు కనిపిస్తున్నారు. ఈ నటీమణులంతా ఎవరి సపోర్టూ లేకున్నా స్వశక్తితో తమని తాము నిరూపించుకుంటున్నవాళ్లే. వీళ్లందరికంటే భిన్నమైన వ్యక్తిత్వం గల నటి కంగనా రనౌత్. బాలీవుడ్లో కంగనకు వచ్చినన్ని బెదరింపులు వేరెవరికీ రాలేదు. సుశాంత్ మరణించాక ఇటీవలే ఆమె ఒక విషయాన్ని బయటపెట్టారు. రాకేశ్ రోషన్‌కి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పకపోతే (హృతిక్ రోషన్‌తో వివాదం విషయంలో) వాళ్లు జైల్లో పెట్టించగలిగినంత పెద్దవాళ్లనీ, చివరికి ఆత్మహత్యే శరణం అవుతుందని జావేద్ అఖ్తర్ తనని ఇంటికి పిలిపించి మరి కేకలేశాడట! ఆ కేకల్ని పట్టించుకోలేదు కంగనా. కెరీర్ ప్రారంభం నుంచీ అలాంటి అరుపుల్ని, హెచ్చరికల్నీ చాలానే వింటూ వస్తున్నారు. నెపోటిజం కు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉన్నారు. అవరోధాలను కల్పించిన వాళ్లను ‘వాళ్ల పాపాన వాళ్లే పోతారు’ అని ఎదిగినవాళ్లు మిగతావాళ్లయితే, తిరగబడి తనని తను నిరూపించుకున్న నటి కంగనా రనౌత్. మరీ రనౌత్‌లా ధిక్కరించకపోయినా.. తనకు తనే ఆశగా, శ్వాసగా ఉండిపోవలసింది సుశాంత్. -
హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య
-
సుశాంత్ ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు
సాక్షి, ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ముంబై పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ మానసిక స్థితితో పాటు ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా డిప్రెషన్‌తో చనిపోయారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇటీవల సుశాంత్ బాంద్రాలో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌కు మారినట్లు తెలుస్తోంది. నెలకు రూ.4.5 లక్షలు ఫ్లాట్ అద్దె చెల్లిస్తున్నటుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పనివాళ్లతో కలిసి సుశాంత్ బాంద్రా ఫ్టాట్‌లో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం జ్యూస్ తాగి బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్న సుశాంత్.. ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య సమయంలో ఫ్లాట్‌లో పనివాళ్లతో పాటు స్నేహితులు ఉన్నారు. ఆయన చివరిగా తన సోదరితో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. గడిచిన ఆరు నెలలుగా సుశాంత్ డిప్రెషన్లో ఉన్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఆయన నివాసంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, కొన్ని మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నామని ముంబై పోలీసులు తెలిపారు. మరోవైపు సుశాంత్ ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు, ఆయన స్నేహితుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్నారు. (చదవండి : సుశాంత్ ఆత్మహత్య: మాజీ ప్రేయసి స్పందన) ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కచ్చితమైన కారణం చెప్పగలం. ఆయన గదిలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులను కనుగొనలేదు. సూసైడ్ నోట్ లభించలేదు, కానీ డిప్రెషన్ తగ్గడానికి వాడే మందులు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నాం. సుశాంత్ వ్యక్తిగత డాక్టర్‌ను సంప్రదించి, అతని మానసిక పరిస్థితి ఏంటి, ఏ రకమైన రుగ్మతతో బాధపడుతున్నాడు, తదితర విషయాలు అడిగి తెలుకుంటాం’ అని ముంబై జోన్ 9 డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాకు తెలిపారు. కాగా, సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని బంధువులు అంటున్నారు. లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి : హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య) మరోవైపు సుశాంత్ ఆత్మహత్య వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కెరీర్లో మంచి స్టేజీలో ఉన్నపుడు ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయం అభిమానులతో కూడా కంటనీరు పెట్టిస్తుంది. ఈ వార్త తమకు షాక్‌కు గురి చేసిందని, సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ చెందిన పలువురు ట్వీట్ చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. -
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫోటోలు
-
సుశాంత్ ఆత్మహత్య: మాజీ ప్రేయసి స్పందన
ముంబై : బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణవార్త విని ఆయన మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే షాక్‌కు గురయ్యారు. ఓ మీడియా సంస్థ అంకితకు ఫోన్ చేసే చెప్పేంతవరకు సుశాంత్ మరణ వార్త ఆమెకు తెలియదట. మీడియా ప్రతినిధి ఫోన్ చేసి విషయం చెప్పగానే.. ఏంటి అని షాకయ్యారు. ఆ తర్వాత ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది. (చదవండి : బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య) కాగా, నటి అంకితా లోఖండే, సుశాంత్ ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. 2016లో కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. వీరిద్దరు గతంలో జీ టీవీలో ప్రసారమైన ‘ పవిత్ర రిశ్తా’ సీరియల్ లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వారు ప్రేమలో పడ్డారు. దాదాపు ఆరేళ్ల పాటు వీరి బంధం కొనసాగింది. 2016లో వీడిపోయేముందు ‘ఒంటరినని బాధపడకు, నేను నీ గుండెల్లో ఎప్పడు చిరస్థాయిగా నిలిచిపోతాను’ అని అంకిత ట్వీట్ కూడా చేసింది. (చదవండి : సుశాంత్ చివరి భావోద్వేగ పోస్ట్ ఇదే) ఆ తర్వాత సుశాంత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బిజీ అయ్యాడు. మణికర్ణిక సినిమాలో అంకిత ముఖ్య పాత్ర పోషించించగా.. ఆ సందర్భంగా సుశాంత్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశాడు. అంకిత, సుశాంత్‌లు వీడిపోయాక కూడా మంచి స్నేహితులుగా కొనసాగారు. కాగా, అంకితా లోఖండేకు ఇటీవల ఎంగైజ్మెంట్ అయినట్లు సమాచారం. విక్కీ జైన్ అనే వ్యక్తితో అంకిత నిశ్చితార్థం జరిగినట్లు వార్తాలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని అంకిత అధికారికంగా ప్రకటించలేదు. కాగా, సుశాంత్ ఆదివారం ముంబైలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుశాంత్ ఆత్మహత్య వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ వార్త తమకు షాక్‌కు గురి చేసిందని, సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ చెందిన పలువురు ట్వీట్ చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. (చదవండి : సుశాంత్ మరణం: షాక్‌లో సినీ ఇండస్ట్రీ) ‘కోయ్ పో చి’తో కెరీర్‌ను ఆరంభించిన సుశాంత్ ఆ తర్వాత ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టీవ్ బొమ్‌కేష్ బక్షి’, ‘ఎం.ఎస్.ధోనిః ద అన్‌టోల్డ్ స్టోరీ’, ‘రాబ్టా’, ‘వెల్కమ్ న్యూయార్క్’, ‘కేదార్నాథ్’, ‘సోంచారియా’, ‘చిచ్చోర్’, ‘డ్రైవ్’ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. -
సుశాంత్ చివరి భావోద్వేగ పోస్ట్ ఇదే
హైదరాబాద్: బాలీవుడ్ యువ హీరో, ‘ఎంఎస్ ధోని’ బయోపిక్ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణవార్త యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. సుశాంత్ హఠాన్మరణాన్ని అటు సినీ ప్రముఖులు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో సుశాంత్ చాలా ఆక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతను ఇన్‌స్టాలో చేసిన చివరి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన తల్లి గురించి కవితాత్మకంగా పెట్టిన పోస్ట్ నెటిజన్లను కంటతడిపెట్టిస్తోంది. ‘మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా' అంటూ జూన్3న ఇన్‌స్టాలో సుశాంత్ భావోద్వేగమైన పోస్ట్ చేశారు. పలు టీవీ సీరియళ్లలో నటించిన సుశాంత్ సింగ్, 1986 జనవరి 21న పట్నాలో జన్మించారు. 2013లో వచ్చిన ‘కై పో చే’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఎంఎస్ ధోని’ బయోపిక్‌తో ఫుల్ క్రేజ్ సాధించారు. View this post on Instagram Blurred past evaporating from teardrops Unending dreams carving an arc of smile And a fleeting life, negotiating between the two... #माँ ❤️ A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on Jun 3, 2020 at 5:43am PDT చదవండి: సుశాంత్ ఆత్మహత్యకు అదే కారణమా? సుశాంత్ మరణం: షాక్‌లో సినీ ఇండస్ట్రీ -
సుశాంత్ ఆత్మహత్యకు అదే కారణమా?
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర వార్త విన్న బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అటు అభిమానులు ఈ వార్త నిజంకాకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. ఇక సుశాంత్ అభిమానులు అత్యంత శోకాతప్త హృదయాలతో ఆయన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. (సుశాంత్ మరణం: షాక్‌లో సినీ ఇండస్ట్రీ) ఇక సుశాంత్ డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ముంబై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గడిచిన ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్లో ఉన్నారని అటు పోలీసులు, ఇటు స్నేహితులు పేర్కొంటున్నారు. ఇక సుశాంత్ నివాసంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, కొన్ని మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి కొంత మంది స్నేహితులతో సుశాంత్ గడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక సుశాంత్ పార్థీవదేహాన్ని ఆయన నివాసం నుంచి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. (బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య) -
సుశాంత్ మరణం: షాక్‌లో సినీ ఇండస్ట్రీ
‘ఎంఎస్ ధోని’ బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ఆదివారం ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ హఠాన్మరణ వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ యువహీరో ఇక లేరనే చేదు వార్తను బాలీవుడ్ ఇండస్ట్రీ దింగమింగుకోలేకపోతోంది. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. సుశాంత్ మరణ వార్త నిజం కాకుండా ఉంటే ఎంతో బావుంటుందంటూ వారు ట్వీట్లు చేస్తున్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ‘అద్భుత ప్రతిభ గల యువ నటుడు సుశాంత్ త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. టెలివిజన్, సినిమాల్లో ఆయన నటన అద్భుతం. కెరీర్ పరంగా అయన ఎదిగిన తీరు అందరికీ స్పూర్థిదాయకం. మరిచిపోలేని ఎన్నో అనుభూతులను మనకు మిగిల్చి ఆయన వెళ్లిపోయారు. సుశాంత్ మరణించారన్న వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓంశాంతి’- ప్రధాని నరేంద్రమోదీ ‘సుశాంత్ మృతి చెందాడన్న వార్త విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. ఇటీవలే సుశాంత్ నటించిన చిచోరే సినిమా చూశాను. ఆ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. తాను కూడా ఆ సినిమాలో భాగస్వామ్యం అయి ఉంటే బాగుండేది అనుకున్నాను. నిజంగా సుశాంత్ చాలా టాలెంటెడ్ హీరో’ - అక్షయ్ కుమార్ ‘సుశాంత్ మరణ వార్తతో షాక్‌కు గురయ్యాను. నా దగ్గర మాటల్లేవు. నా గుండె పగిలింది. ఈ వార్త నిజం కాకుండా ఉంటే బాగుండు’. - సోనూసూద్ ‘ఈ వార్త వినడం నిజంగా బాధాకరం. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి... సుశాంత్ ఆత్మకు శాంతి కలగాలి’ - అజయ్ దేవగన్ ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లేరనే వార్త నన్ను ఎంతగానో బాధించింది. ప్రతిభావవంతుడైన యవ నటుడు అతడు. అతడి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలయజేస్తున్నా. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి’ - సచిన్ టెండూల్కర్ ‘సుశాంత్ సింగ్ విషాదకరమైన మరణవార్తను విని షాక్ అయ్యాను. ప్రతిభ, అవకాశాలతో కూడిన జీవితం అకస్మాత్తుగా ముగిసింది. అతడి కుటుంబానికి, అభిమానులకు నా సానుభూతి’ - టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ‘ఆ మాటలు నన్ను షాక్‌కు గురిచేశాయి. హృదయం ముక్కలైంది. నిజంగా విషాదకరమైన వార్త. మాటలు రావడం లేదు. చాలా త్వరగా వెళ్లిపోయాడు’ - తరణ్ ఆదర్శ్ ‘జేమ్స్ డీన్, హీత్ లెడ్జర్ మరణించిన తర్వాత నన్ను షాక్‌కు గురిచేసింది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం. కరోనా వైరసే కాకుండా ఆ దేవుడు కూడా బాలీవుడ్‌పై పగబట్టినట్లు ఉన్నాడు’ - రామ్‌గోపాల్ వర్మ ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం అనే మాటలు విని షాక్ అయ్యాను. ప్రతిభావంతుడైన యువకుడు. అతని ఆత్మ శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నాను. సుశాంత్ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’ - మహేశ్ బాబు. చదవండి: బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ హీరో మాజీ మేనేజర్ ఆత్మహత్య -
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య
సాక్షి, ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారో కారణాలు తెలియరాలేదు. కాగా గత ఆరు నెలలుగా సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ‘కోయ్ పో చి’తో కెరీర్‌ను ఆరంభించిన సుశాంత్ ఆ తర్వాత ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టీవ్ బొమ్‌కేష్ బక్షి’, ‘ఎం.ఎస్.ధోనిః ద అన్‌టోల్డ్ స్టోరీ’, ‘రాబ్టా’, ‘వెల్కమ్ న్యూయార్క్’, ‘కేదార్నాథ్’, ‘సోంచారియా’, ‘చిచ్చోర్’, ‘డ్రైవ్’ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘దిల్ బేచారా’. కాగా బాలీవుడ్లో లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పలువురు టెక్నీషియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ వార్త తమకు షాక్‌కు గురి చేసిందని, సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్, టాలీవుడ్ చెందిన పలువురు ట్వీట్ చేశారు. ఈ నెల 9న సుశాంత్ మేనేజర్ కూడా ఆత్మహత్య కాగా ఆరు రోజుల క్రితం (9వ తేదీన) సుశాంత్ సింగ్ దగ్గర మేనేజర్‌గా పని చేసిన దిశ సలియా ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైలో తన భవనంలోని 14వ అంతస్థు పైనుంచి దూకింది. తీవ్ర రక్తస్రావమైన ఆమెను వెంటనే బొరివలిలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
'వుయ్ లవ్ యూ ధోని'
బెంగళూరు: 'రీల్' ధోని సుశాంత్ సింగ్ రాజపుత్ రియల్ ధోనిని కలిశాడు. అంతేకాదు అతడితో కలిసి ఫొటో దిగి తన ట్విటర్ పేజీలో పోస్టు చేశాడు. టీమిండియా నాయకుడు 'మిస్టర్ కూల్'పై ప్రశంసలు కురిపించాడు. ధోని జీవితంపై వంద సినిమాలు తీసినా సరిపోవని అన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారుల్లో ధోని ఒకడని కితాబిచ్చాడు. ధోని గొప్ప వ్యక్తి అని, అతడంటే తనకెంతో ఇష్టమని ట్వీట్ చేశాడు. టీ20 ప్రపంచకప్ లో బుధవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి కూడా సుశాంత్ కామెంట్లు పోస్ట్ చేశాడు. క్రికెట్ అంటే ఇలా ఆడాలని పేర్కొన్నాడు. టెన్షన్ మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా అభినందనలు తెలిపారు. ధోని అంటే తమకెంతో ఇష్టమని పునరుద్ఘాటించాడు. ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాలో సుశాంత్ హీరోగా నటించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. We can make 100films on U& it'll still not be enough.U r 1of the best sports mind ever & a GREAT person.We love u MS pic.twitter.com/ArWkldrZMo — Sushant S Rajput (@itsSSR) March 24, 2016 రనౌట్ కు ముందు ధోని ఏం చేశాడంటే... -
‘ధోని’ సినిమా చూపిస్తున్నాడు!
- తెరపై భారత క్రికెట్ కెప్టెన్ బయోగ్రఫీ - ధోని పాత్ర పోషిస్తున్న సుశాంత్ రాజ్‌పుత్ ముంబై: క్రికెట్ ప్రపంచంలో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఇప్పుడు సినిమాగా తెరకెక్కనుంది. సాధారణ కుటుంబ నేపథ్యంనుంచి వచ్చి భారత క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదిగిన అతను ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతని జీవితంలోని అనేక మలుపులు, విశేషాలతో ‘ఎం.ఎస్. ధోని - ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో సినిమా రూపొందుతోంది. ధోని గురించి క్రికెట్ వీరాభిమానులకు కూడా తెలియని ఎన్నో విషయాలు ఈ చిత్రంలో చూపించనున్నారు. ‘ఎ వెడ్నస్ డే’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నీరజ్ పాండే దీనికి దర్శకత్వం వహిస్తుండగా...‘కై పో చే’ చిత్రంలో వెలుగులోకి వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ధోని నాయకత్వంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్ గెలిచి సరిగ్గా ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ధోనికే చెందిన ఇన్స్పైర్డ్ ఎంటర్టైన్మెంట్- రితి స్పోర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. క్రీడాకారుల జీవిత చరిత్రతో ఇటీవల రూపొందించిన భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. వచ్చే ఏడాది ధోని సినిమా విడుదలవుతుంది. గతంలోనే ధోనిపై సినిమా నిర్మాణంలో ఉందని, అయితే బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసిందని వార్తలు వచ్చాయి. అయితే దీనిని కొట్టిపారేసిన బోర్డు, ధోని ప్రొఫెషనల్ కెరీర్‌కు సమస్య రానంత వరకు అతని సినిమాపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. -
టీవీక్షణం: సినిమా పిలిచింది!
టీవీ ఆర్టిస్టులందరికీ సినిమాల్లో నటించాలనే ఉంటుంది. అందుకే సీరియల్స్‌లో కాస్త పేరు వచ్చాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అంకితా లోఖండే, అవికా గోర్, ద్రష్టి ధామిలను మాత్రం సినిమా అవకాశాలే వెతుక్కుంటూ వచ్చాయి. బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కి కాబోయే భార్య అయిన అంకిత... పవిత్రరిష్తా సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకుంది. అదే ఆమెకు షారుఖ్ ఖాన్ సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించింది. ఫరాఖాన్ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తోన్న ‘హ్యాపీ న్యూ ఇయర్’లో ఓ ముఖ్య పాత్ర చేస్తోంది అంకిత. అలాగే ‘చిన్నారి పెళ్లికూతురు’గా అందరి మనసులనూ దోచుకున్న అవికా గోర్... ‘ఉయ్యాల జంపాల’ అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. ఇక ద్రష్టి ధామి. అదృష్టం అంటే ఆమెదే. సీరియల్స్‌లో తిరుగు లేదు. పైగా ఝలక్ దిఖ్లాజా డ్యాన్స షోలో గెలిచి మరింత పాపులర్ అయిపోయింది. దాంతో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్ర దర్శకుడు రోహిత్‌శెట్టి... ఆమెని ఏకంగా అజయ్ దేవగన్ సరసన హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. అది కనుక కన్ఫామ్ అయితే ఇక ద్రష్టికి తిరుగే ఉండదు. ఆమె బాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఇలా ముగ్గురు ఫేమస్ టీవీ స్టార్సని ఒకేసారి సినిమా అవకాశాలు ముంచెత్తడం విశేషమే. చెప్పాలంటే... సీరియళ్లలో ప్రదర్శించినన్ని భావోద్వేగాలను సినిమాల్లో చూపించాల్సిన అవసరం ఉండదు. అందుకే సీరియల్స్‌లో నటించడమే కష్టమంటారు. అలా చూసుకుంటే... ఈ టాప్ టీవీ నటీమణులు కచ్చితంగా సినిమాల్లో సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. చూద్దాం... వీరి సినీ ప్రయాణం ఎలా సాగుతుందో!