
ముంబై : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ అబూ జానీ, సందీప్ ఖోస్లా బంధువులు పెళ్లి బాలీవుడ్ స్టార్స్ తళుకుల మధ్య అట్టహాసంగా జరిగింది. సోనంకపూర్, భూమి పడ్నేకర్, నీతూ సింగ్, దింపుల్ కపాడియా, ట్వింకిల్ ఖన్నా, కరణ్ జోహర్, సారా అలీఖాన్ వంటి ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. శనివారం సాయంత్రం ముంబైలో జరిగిన ఈ పెళ్లిలో బాలీవుడ్ స్టార్స్ కన్నా.. మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తనయురాలు శ్వేత బచ్చన్ నందా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బిగ్ బీ తనయురాలైనప్పటికీ శ్వేత వెండితెరపై కనిపించలేదు. కానీ, ఆమె ఈ పెళ్లి వేడుకలో తల్లి జయాబచ్చన్‌తో కలిసి వేసిన స్టెప్పులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అలవొకగా ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకవేళ శ్వేత బచ్చన్ సినిమాల్లోకి వచ్చి ఉంటే.. తన తండ్రిలాగే వెండితెరపై రాణించేది అనిపించేలా.. ఆమె డ్యాన్స్ అదరగొట్టింది. ఈ పెళ్లి వేడుకలో సోనంకపూర్, సారా అలీఖాన్, కరణ్ జోహన్ కూడా స్టెప్పులు వేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment